లాంచ్‌ అయిన Tecno Spark 9T స్మార్ట్‌ ఫోన్.. ఫీచర్స్‌ ఇవే..!

-

టెక్నో నుంచి స్పార్క్‌ 9టీ ఫోన్‌ విడులైంది. 9 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్. ఈ ఫోన్ స్పెషల్‌ ఫీచర్స్‌ ఇంకా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టెక్నో స్పార్క్ 9టీ ధర..

ఈ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 78,300 నైరాలుగా అంటే సుమారు రూ.14,600 నిర్ణయించారు.
128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 88,000 నైరాలుగా అంటే సుమారు రూ.16,400గా ఉంది.
అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సియాన్, ఐరిస్ పర్పుల్, కోకో గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

టెక్నో స్పార్క్ 9టీ స్పెసిఫికేషన్స్‌..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 9టీ పనిచేయనుంది.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా అందించారు.
దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ కూడా ఇందులో ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news