చైనాలో లాంఛ్ అయిన Lenovo Tab P12 Pro.. 8 GB RAM+ 256 GB స్టోరేజ్‌

లెనొవో నుంచి..ఫ్లాగ్‌షిప్‌ ఆండ్రాయిడ్‌ ఫీచర్లతో కాస్ట్లీ టాబ్లెట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. అదే.. Lenovo Tab P12 Pro. ఈ ప్రీమియం టాబ్లెట్‌లో డాల్బీ విజన్‌ను అందించే AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. దీని ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
అంతేకాకుండా ఈ టాబ్లెట్‌తో వినియోగదారులకు Lenovo Precision Pen 3 అనే స్టైలస్‌ను అందిస్తున్నారు.
ఈ స్టైలస్ టాబ్లెట్‌తో దానంతటదే పెయిర్ చేసుకుంటుంది.
లేటెన్సీ రేట్ కూడా తక్కువ ఉంటుంది.
అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Lenovo Tab P12 Pro టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగిన 12.6-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇందులో ఉంది.
8 GB RAM+ 256 GB స్టోరేజ్ సామర్థ్యం
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
వెనకవైపు 13MP + 5MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇది పనిచేస్తుంది.
10200 mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఛార్జింగ్
ధర, రూ. 69,999/-గా నిర్ణయించారు.
Lenovo Tab P12 Pro ఇప్పుడు లెనొవొ అధికారిక వెబ్ సైట్ Lenovo.com, ఈ-కామర్స్ భాగస్వామి Amazon.in అలాగే Lenovo ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లెనొవొ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే పాపులర్ టాబ్లెట్‌ మోడల్స్ అయిన శాంసగ్ గెలాక్సీ Tab S-series అలాగే షావోమి Pad 5 వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. అంతేకాకుండా దేశంలో వివిధ రకాల ఐప్యాడ్‌లను విడుదల చేస్తున్న ఆపిల్‌కు గట్టి పోటీని ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందట. మరీ ఇది ఈ కంపెనీలకు పోటీ ఇస్తుందో లేదో చూడాలి.