మూడు వేరియంట్లలో లాంచ్‌ అయిన Realme GT 2 Master Explorer Edition

-

రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చింది. అదే Realme GT 2 Master Explorer Edition. కంపెనీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. పోయిన సంవత్సరం లాంచ్‌ అయిన రియల్‌మీ జీటీ మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ విడుదలైంది. ఫీచర్స్‌ సిమిలర్‌గా ఉన్నాయా..లేక పూర్తిగా మార్చేసారో లేదో చూద్దామా..!

రియల్‌మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ధర..

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లుగా అంటే సుమారు రూ.41,390గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,799 యువాన్లుగానూ అంటే సుమారు రూ.44,900గా ఉంది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ సుమారు రూ.47,300గా నిర్ణయించారు.

రియల్‌మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 స్కిన్‌పై పనిచేయనుంది.
రియల్‌మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 1000 హెర్ట్జ్‌గానూ ఉంది.
హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
స్టీల్ వేపర్ కూలింగ్ చాంబర్‌ను కూడా అందించారు.
అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్లు వీటిలో ఉన్నాయి.
హైరిజల్యూషన్ ఆడియో, డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది

కెమెరా క్వాలిటీ..

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news