మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో Moto G52j

మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్ లో విడుదల చేశారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్ ఎంతుందో చూద్దామా..!

మోటో జీ52జే ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 39,800 యెన్‌లుగా (సుమారు రూ.24,000) నిర్ణయించారు.

మోటో జీ52జే హైలెట్స్..

ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్ ఉండనుంది.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్‌గా ఉంది.
యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై మోటో జీ52జే పనిచేయనుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఈ స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం.. కెమేరా క్వాలిటీ..

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ పొందింది. ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమేరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమేరాను అందించారు. అయితే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు.