లాంచ్‌ అయిన Oppo A57e.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!!

-

ఒప్పో తన కొత్త ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. అదే ఒప్పో ఏ57ఈ స్మార్ట్ ఫోన్. ఇది కూడా బడ్జెట్‌ ఫోన్.. ఇందులో ఫీచర్స్‌ మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం..5000 ఎంఏహెచ్‌ ఉంది. ఇంకా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఒప్పో ఏ57ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో ఏ57ఈ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు అందించారు.
దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఒప్పో రెనో 8జెడ్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. దీని ధరను 12,990 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా అంటే సుమారు రూ.28,600గా నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news