కాపర్ బ్లష్ లో Samsung Galaxy F23 5G.. ధర మారిందా..!

-

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ లో భాగంగా.. Samsung Galaxy F23 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. మార్చిలోనే ఈ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. కాపర్ బ్లష్ అనే కొత్త కలర్ వేరియంట్ మాత్రం ఇప్పుడే లాంచ్ చేసింది. కేవలం రంగులేనే తేడా.. మిగతా అంతా సేమ్.. గాడ్జెట్స్ కొనేవాళ్లకు ఫోన్ ఫీచర్స్ ఎంత ముఖ్యమే.. ఆ కలర్ కూడా అంతే ఇంపార్టారెంట్ కదా.. కలర్ ను బట్టే ఫోన్ కాస్ట్ కూడా అటూఇటూ అవుతుంది..!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ధర..

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.
గతంలో ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు కాపర్ బ్లష్ రంగులో కూడా లభిస్తుంది.

ఫోన్ పై ఆ‌ఫర్లు..

ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే… రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ పనిచేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లేను అందించారు.
దీని డిస్‌ప్లే ప్యానెల్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా అందించారు.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ పనిచేయనుంది.
డాల్బీ అట్మాస్ సపోర్ కూడా అందించారు.

కెమేరా క్వాలిటీ..

వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను శాంసంగ్ అందించింది.

బ్యాటరీ సామర్థ్యం..

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news