Vivo Y21G బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో బెస్ట్ ఫీచర్స్..!

-

వివో నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. వివో వై-సిరీస్ లో ఇది విడుదలైంది. వివో వై21జీ స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయింది. 4జీబీ ర్యామ్, 6.51 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతో ఇప్పుడు ఈ ఫోన్ సైతం ట్రెండింగ్ లో ఉంది. ఈరోజు మనం ఫోన్ రివ్యూ చూద్దామా!

Vivo Y 21జీ ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,990గా కంపెనీ నిర్ణయించింది.
డైమండ్ గ్లో, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఆఫ్ లైన్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్‌లైన్ సేల్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది.

వివో వై21జీ హైలెట్స్..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.

4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 1 జీబీ పెంచుకోవచ్చు.

64 జీబీ స్టోరేజ్‌ను కూడా ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

మీడియాటెక్ ఎంటీ6769 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా… బరువు 182 గ్రాములుగా ఉంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ అపెర్చర్ లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news