ఎలిస్తా నుంచి మరో స్మార్ట్ టీవీ లాంచ్..స్పెసిఫికేషన్స్, ధర..

ప్రస్తుతం మార్కెట్ లో కొత్త టీవీ లకు డిమాండ్ ఎక్కువ..అడ్వాన్స్ టెక్నాలజీ తో వస్తున్న ఈ టీవీ లకు పోటీ ఎక్కువ..తాజాగా మార్కెట్ లోకి ఎలిస్తా నుంచి మరో స్మార్ట్ టీవీ లాంచ్ అయ్యింది..ఆ టీవీ ఫీచర్స్,ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3840×2160 రెజల్యూషన్ ఉండే అల్ట్రా హెచ్‌డీ 4కే క్వాంటమ్ లూసెంట్ డిస్‌ప్లేలను ఈ ఎలిస్తా స్మార్ట్ టీవీలు కలిగి ఉన్నాయి. 400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ ఉంటుంది. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లలో అడుగుపెట్టిన ఈ టీవీలు వెబ్ఓఎస్‌ పై రన్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేకమైన హాట్‌కీస్ ఉండే రిమోట్ ఈ టీవీలతో పాటు వస్తుంది. వాయిస్ కమాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.డాల్బీ ఆడియో, హై ఫెడిలిటీ సరౌండ్ సౌండ్ ఉండే స్పీకర్లను ఈ టీవీలు కలిగి ఉన్నాయి..గేమింగ్ కోసం మంచి టీవీ అనే చెప్పాలి.

ఈ టీవీ ధర..

ఎలిస్తా స్మార్ట్ టీవీ 43 ఇంచుల మోడల్ ధర రూ.48,990గా ఉంది. 50 ఇంచుల వేరియంట్ ధర రూ.59,990, 55 ఇంచుల మోడల్ ధర రూ.70,990గా ఉంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ టీవీలు సేల్‌కు రానున్నాయని ఆ సంస్థ వెల్లడించింది..ఇటీవల విడుదల అయిన టీవీకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడటం సంతోషంగా ఉందని కంపెనీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.