వాట్సాప్‌లో గోప్యతకు మరో కొత్త‌ ఫీచర్‌..

-

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగ‌దారుల‌కు ఆక‌ట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వారు అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాట్సప్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న వాట్సాప్ తాజాగా యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు.

ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్‌ స్థానంలో ’మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. యూజరును నేరుగా గ్రూప్‌లో చేర్చేందుకు తమకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్‌ ద్వారా గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్లు .. వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news