ఐఫోన్, ఐపాడ్ అని యాపిల్ ప్రోడక్ట్స్ ముందు ”ఐ” అని ఎందుకు ఉంటుంది..?

-

ఏ యాపిల్ ప్రొడక్ట్స్ వచ్చినా సరే ఐ ఫోన్, ఐ పాడ్, ఐ పోడ్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ కి కూడా ముందు ఐ అని ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు ఐ ఫోన్, ఐ పాడ్, ఐ పోడ్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ కి కూడా ముందు ఐ ఉంటుంది అని… మరి దాని వెనుక కారణాన్ని ఇప్పుడు చూద్దాం.

 

యాపిల్ తన ప్రొడక్ట్స్ ని మొదటి సారి 1998లో విడుదల చేసిన విషయం తెలిసిందే. యాపిల్ తీసుకు వచ్చినా ఐమాక్ కంప్యూటర్ అమ్మకాల్లో మొదటి స్థానం లో వున్నా సంగతి తెలిసిందే. ఐమ్యాక్ కి డిమాండ్ ఎక్కువ వుంది. పైగా సక్సెస్ అయ్యింది ఇది. ఇతర కంప్యూటర్ల కంటే కూడా ఐమ్యాక్ బాగా సేల్ అయ్యింది. యాపిల్ కో- ఫౌండర్, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ ఓసారి ఐ ఫోన్, ఐ పాడ్, ఐ పోడ్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ కి కూడా ముందు ఐ ఎందుకు ఉంటుంది అనేది చెప్పారు.

ఈ ప్రొడక్ట్స్ కి ముందు వుండే ఐ ఇంటర్నెట్ ని సూచిస్తోంది. ఐ అంటే ఇంటర్నెట్. కానీ ఓసారి స్లైడ్స్‌ ప్రదర్శించిన సమయంలో ఐ అంటే చాలా అర్ధాలు వస్తాయన్నారు. ఇంటర్నెట్, ఇండివిడ్యుఅల్, ఇంస్ట్రక్ట్ ఇలా చాలా. స్టీవ్ జాబ్స్ ఐ తో ప్రొడక్ట్స్ ఏ తీసుకు వచ్చారు కానీ సీఈఓ టిమ్ కుక్ మాత్రం ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌ట్యాగ్స్ వంటి తీసుకు వచ్చారు. ఎయిర్ ఫోన్ కూడా రావచ్చేమో మరి..?

Read more RELATED
Recommended to you

Latest news