గుప్పెండంతమనసు ఎపిసోడ్ 319: కథలోకి మరో వ్యక్తి ఎంట్రీ..అప్పుడు శిరీష్..ఇప్పుడు గౌతమ్..రిషీ పరిస్థితేంటో..!

-

గుప్పడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని, జగతి, వసూ రెస్టారెంట్ లో ఉంటారు. దేవయానికి ఆ అబ్బాయి ఫోన్ చేసి రిషీ సార్ ఇప్పుడే బయలుదేరారు అని చెప్తాడు. దేవయాని ఆట మొదలుపెడదాం అని..వసూని రెచ్చగొడతుంది. నీకు గర్వమా, అహంకారమా, వీదేశాల్లో చదువుకునే అవకాశం వస్తే వెళ్లొచ్చుకదా..హాయిగా సెటిల్ అయ్యేదానివి కదా అంటుంది. వసూ..ఎదుటివారు ఏం చేయాలో మీకెందుకు మేడమ్, మీరు కూడా కాలేజ్ లో జాబ్ చేస్తే టైం పాస్ అయ్యేదికదా..అలా నేను అనటం లేదు కదా..ఎదుటివారికి సలహాలు ఇవ్వటం మానుకోండి మేడమ్ అంటూ వసూ అంటుంది. దేవయాని జగతితో ఇలాంటి శిష్యురాల్లు నీకు ఇంకా చాలామంది ఉన్నారా, అంటే ఇలాంటి వాళ్లను ఒక గ్రూప్ నే తయారుచేస్తున్నావా అంటుంది. జగతి పనిమాల పనిమానుకుని..ఇక్కడకొచ్చి కబుర్లు చెప్తున్నారేంటి అంటుంది. చెప్తే తప్పేం ఉంది జగతి..తప్పు చేస్తుంటే తప్పమ్మా అని చెప్తున్నా అంటుంది దేవయాని. తప్పు ఒప్పులు మీరు మాట్లాడటం కన్నా పెద్ద తప్పు ఇంకోటి లేదులే అక్కయ్య అంటుంది జగతి. ఇంకోవైపు రిషీ వేగంగా కారులో వస్తుంటాడు.

వెనకే మహేంద్ర కూడా వస్తాడు. దేవయాని డోస్ పెంచుతుంది. కాఫీ వస్తుంది. కావాలనే దేవయాని రెచ్చగొడుతుంది. నువ్వు నీ శిష్యురాలు పద్ధతులు మార్చుకోవాలి అంటుంది. వసూకి కాల్తూ ఉంటుంది. మీరు మాకు ఉపన్యాసాలు చేయాలని వస్తే కాఫీ తాగేసి వెళ్లిపోండి. మీరు ఉపన్యాసాలు ఎవ్వరూ వినరు అంటుంది. నువ్వు ని శిష్యురాలు రిషీని మీ వైపుకు తిప్పుకోవాలని చాలాప్లాన్లు వేస్తున్నారు అంటుంది దేవయాని. వసూ చిన్నపిల్లాడు కాదు..తిప్పుకోవటానికి అంటుంది. రిషీ చిన్నపిల్లాడే అంటుంది దేవయాని. ఆ మాటకు వస్తే..రిషీ సార్ మేడమ్ వాళ్ల అబ్బాయే కదా..తిప్పుకుంటే తిప్పుకుంటారు మీకేంటంట అంటుంది వసూ. జగతి వసూని కంట్రోల్ చేస్తుంది. దేవయాని ఇంకా రిషీ రావటంలేదేంటి అనుకుని..ఇంకా ఓవర్ చేస్తుంది. ఇది రెస్టారెంట్ కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను..చిన్న మాట అన్నందుకే నీకు నీ శిష్యురాలికి కోపాలు వస్తున్నాయి.. అని రిషీ వసూల సెల్ఫీలు చూపిస్తూ..వీటిని చూస్తే నాకెంత కోపం రావాలి అంటుంది. ఇవి మీ దగ్గరకు ఎలా వచ్చాయి అని వసూ అంటే..ఎలా వచ్చాయి అని కాదు..ఈ ఫోటోలు ఎంటి అని..ఏంటి జగతి ఇది ఏంటి ఇది..వయసొచ్చిన కొడుకు మీదకు వసుధారను ఉసిగొలుపుతున్నావా ఛీ ఛీ అంటుంది. ఆ మాటకు వసూ జగతిలకు కోపం వస్తుంది.

ఈ ఫోటోలు ఎంత మంది దగ్గరకు వెళ్లాయో నీకేం తెలుసు..అందరూ చూస్తే ఏం అనుకుంటారు అంటుంది. ఇంతలో రిషీ వచ్చింది ఆ అబ్బాయి మెసేజ్ చేస్తాడు. దేవయాని నుల్చోని..ఇంకా రెచ్చగొడుతుంది. మా కుటుంబపరువు బజారుకీడుస్తావా, ఈ ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేద్దామని మీ ఇద్దరి ఆలోచన, ఒక్కడే కొడుకు కదా..ఆస్తులున్నాయని వల విసురుతున్నారా మా రిషీకి అంటుంది. అప్పుడే రిషీ వస్తాడు. వసూ వేలు చూపించి..మర్యాదగా మాట్లాడండి మేడమ్, మర్యాద అంటుంది. రిషీ రావటం దేవయాని చూస్తుంది. వసూ ఏం అనుకుంటున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు, నా సంగతి మీకు తెలియదు మేడమ్, నేను జగతి మేడమ్ లా కాదు, నోటికివచ్చిందల్లా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటుంది. జగతి ఆగు వసుధార అంటే..మీరు ఉండండి మేడమ్..ఏం మాట్లాడుతుంది ఆవిడ..బ్లాక్ మెయిల్ ఏంటి, ఒక్క కొడుకు అంట, ఆస్తులంట ఎలా కనిపిస్తున్నామ్ మేడమ్ అసలు అంటుంది. ఇంతలో దేవయాని కావాలనే..చెయిర్ మీదేసుకుని కిందపడుతుంది.

రిషీ అక్కడినుంచే..కోపంతో వసుధార అని అరిచి..ఆ దేవయానిని లేపుతాడు. దేవయాని ఏదో కాలువిరిగి పోయినట్లే ఏడుస్తుంది. రిషీ బుద్దుందా నీకు అని వసూని అంటాడు, పెద్దమ్మకు వేలుచూపిస్తావా, పెద్దమ్మ మీదకు కుర్చీవిసురుతావా ఛీ ఛీ అంటాడు. దేవయాని నన్ను వీళ్లు చంపేస్తున్నారు రిషీ, కుర్చీని మీదకు విసిరింది అంటాడు. నేను విసరటమేంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వసూ అంటే..షట్ అప్ వసుధార..నా కళ్లతో నేను చూశాను, విన్నాను..ఈవిడ వయసుకన్నా గౌరవం ఇ‌వ్వాలని తెలియదా మీకు..ఛీ ఛీ ఏం మనుషులో మీరు, నీతులు చెప్తారు, కొటేషన్స్ చెప్తారు..ఇలాంటిదేదో జరుగుతుందనే నేను ఇక్కడకు వచ్చాను అని..దేవయానిని లేపుతాడు. జగతి వస్తే..రావొద్దు దగ్గరుండి చేయించారు కదా అంటాడు రిషీ. వసూ జరిగిందేంటో తెలుసుకోకుండా అంటుంటే..షట్ అప్ వసుధార ఇంకొక్క మాట మాట్లాడినా అమ్మాయివని కూడా చూడను అంటాడు.

ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏమైంది రిషీ అంటే..మీరు కూడా వచ్చారా, వీళ్లిద్దరూ కలిసి పెద్దమ్మమీద దాడి చేశారు అంటాడు రిషీ. జగతి దాడి ఏంటి సార్..ఆవిడే వచ్చి మమ్మల్ని తిడుతుంటే అంటుంది. రిషీ మేడమ్..మీ ఇద్దరిలో ఏ ఒక్కరు మాట్లాడినా మర్యాదగా ఉండదు అంటాడు. మహేంద్ర రిషీ ఏమైందో తెలుసుకున్నావా, వీళ్లు ఎందుకు దాడి చేస్తారు అంటాడు. రిషీ ఇంకొక్క మాట వాళ్లకు సపోర్టగా మాట్లాడినా జీవితంలో మీతో మాట్లాడను అంటాడు. వామ్మో ఈ దేవయాని ఓవర్ యాక్షన్ మామూలుగా చేయదు. రిషీ దేవయానిని తీసుకెళ్తూ..థ్యాంక్స్ వసుధార, మా పెద్దమ్మమీదకే వేలు చూపించావ్, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్..నువ్వు కాకుల గుంపులో ఉన్న కోయిలమ్మ అనుకున్నాను, నా అంచనా తప్పని నీరూపించావ్, నువ్వొక ప్రత్యేకమైన దానివి అనుకున్నాను, నువ్వు కూడా మామూలు మనిషిలా బిహేవ్ చేశావ్, అందిరతో ఉంటూ..అందరిలాగా మారిపోయావ్. నీ అస్థిత్వాన్ని కోల్పోయావ్ వసుధార,ఐ హేట్ యూ అని వెళ్లిపోతాడు.

మహేంద్ర ఏంటి జగతి ఏమైంది అంటాడు. దేవయాని వెళ్తూ గేట్ దగ్గరకు వెళ్లి వెనక్కుచూసి..వీళ్లకు కన్నుకొడుతుంది. అది ఈ ముగ్గురూ చూస్తారు. మహేంద్రకు మ్యాటర అర్థమవుతుంది. కారులో వస్తున్న దేవయాని..కాలు నొప్పిగా ఉంది రిషీ, నా వల్ల కావటంలేదు రిషీ అంటుంది. కేసేపు ఓర్చుకోండి పెద్దమ్మా..డాక్టర్ దగ్గరకు వెళ్దాం అని..మీరు అసలు ఎందుకు వెళ్లారు, వాళ్లు మిమ్మల్ని ఏమైనా అన్నారా అంటే..ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను రిషీ అంటాడు. రిషీ మనసులో చాలా పెద్దతప్పు చేశావ్ వసుధార..జగతి మేడమ్ కోసం పెద్దమ్మను బాధపెట్టావ్, క్షమించేది లేదు అనుకుంటాడు. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో వసూ రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుంటే..ఎవరో ఒకఅతన్ని కారు గుద్దేసి వెళ్తుంది. అది వసూ చూసి..వెళ్లేపోయే కారులను ఆపుతుంది. ఇంతలో ఒక ట్యాక్సీ అతను ఆపుతాడు. ఇద్దరూ కలిసి అతన్ని హాస్పటల్ కి తీసుకెళ్తారు. ఇక్కడ రిషీ ఇంత చేసి కనీసం పెద్దమ్మకు ఎలా ఉందని మెసేజ్ కూడా చేయలేదు, సారీ కూడా చెప్పలేదు అనుకుంటాడు. అక్కడ హాస్పటల్ లో ట్యాకీ అతను వసూకి పులిహోర కలుపుతాడు. నా పేరు గౌతమ్ అని షేకాండ్ ఇవ్వబోతే.వసూ నమస్కారం పెడుతుంది. వాడు మనుసులో నా పేరు చెప్పినప్పుడు తన పేరు కూడా చెప్పొచ్చుగా అనుకుంటాడు. ఇక్కడ రిషీ తన మేసేడ్ కోసం నేను వెయిట్ చేయటం ఏంటి..నేను కాల్ చేసి క్లాస్ ఇస్తాను అనుకుని కాల్ చేస్తాడు. వసూ తియ్యదు. మనోడికి ఇంకా కోపం వస్తుంది. దీన్నిబట్టి చూస్తే..అప్పుడు శిరీష్ ఇప్పుడు గౌతమ్ అన్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news