కార్తీకదీపం 1207 ఎపిసోడ్: పండగ చేసుకుంటున్న కార్తీక్ కుటుంబం..మరో కుట్రకు ప్లాన్ చేస్తున్న మోనిత

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కుటుంబం మాంచి జోష్ మీద ఉంటుంది. హాల్ అందరూ కుర్చోని ఉంటారు. దీప పొడుపులకథలు అడుగుతుంది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో సౌందర్య స్వీట్స్ తీసుకుని వస్తుంది. అందరూ ఇలా నవ్వుకుని మాట్లాడుకుని ఎన్నాళ్లయిందో కదా, ఈరోజే మనకు అసలైన దీపావళి అని కోడళ్లకు పెడుతుంది. సిట్టింగ్ పొజీషన్ మారుస్తుంది. జంటలు జంటలుగా కుర్చుంటారు. అబ్బో ఒక్కొక్కల మొఖాలు భలే వెలిగిపోతాయిలే. సెల్ఫీలు తీసుకుంటారు. ఇక్కడ మోనిత మాత్రం దిగాలుగా కుర్చుంటుంది. లాయర్ తో మంతనాలు చేస్తుంది. ఏం చేసైనా, డబ్బు ఎంత ఖర్చు అయినా నేను అరేంజ్ చేస్తాను, సున్నాలు ఎన్ని ఖరైనా పర్వాలేదు..ఆ దీపను సున్నాగా మార్చాలి, మనం అనుకున్నది రెండు వారాల్లోగా పూర్తిచేయాలి అంటుంది మోనిత. లాయర్ మీరు ఒక పనిచేయాలి ఏదో మ్యూట్ వాయిస్ లో చెప్తాడు. చేయగలరా మేడమ్ అంటే.. చేస్తాను అంటుంది మోనిత. లాయర్ వెళ్లిపోతాడు. మోనిత నాలుగు డైలాగులు చెప్పి గెలిచాను అనుకుంటున్నావా దీపక్కా, గెలుపంటే ఏంటో నేను చూపిస్తాను అని తనలో తనే మంగమ్మశపథలాు వేసుకుంటుంది.

అబ్బో కార్తీక్ ఇంట్లో పాటలు పెట్టుకుని అందరు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, ఆదిత్య డ్యాన్స్ వేస్తారు. అసలు వీళ్లు ఇంత సంతోషంగా ఇన్ని ఎపిసోడ్ లో ఏరోజు ఉండలేదు. పిల్లలు కథలు చెప్పమని సౌందర్యను అడుగుతారు. వినండి వినండి మళ్లీ జీవితంలో కథచెప్పమని చస్తే అడగురు అంటాడు ఆనంద్ రావు. కట్ చేస్తే రూంలో దీప ఉంటే..కార్తీక్ బాబు ఫుల్ జోష్ మీద ఉంటాడు. ఏదో గిఫ్ట్ తెచ్చి కాసేపు దీపతో సరసాలు ఆడి..మహాప్రస్తానం బుక్ ఇస్తాడు. దీప మొదట సంతోషించి..వద్దులేండి డాక్టర్ బాబు అంటుంది. నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసే అని, ఈ పుస్తకం అంటే నీకు ఎంతో ఇష్టమో నాకు తెలుసు అంటాడు కార్తీక్. దీప ఆ పుస్తకం గురించి పొగిడి అందులోంచి ఒక కవిత చెప్తుంది. కార్తీక్ జరిగిపోయిన నిన్నటి దశను మర్చిపోయి మనమిద్దరం మళ్లీ పుడదాం, నేను నిన్ను చాలా బాధపెట్టాను, నన్ను క్షమించు దీప అని కార్తీక్ అంటే..దీప ఓ లుక్ ఇస్తుంది..కార్తీక్ కు భయమేస్తుంది. దీప నవ్వి..సరదాగా మాట్లాడుకుంటారు. బస్తీలో హెల్త్ క్యాంప్ పెట్టాలని అనుకుంటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది.

మరుసటిరోజు ఉదయం..మోనిత లాయర్ కి ఫోన్ చేస్తుంది. నేను చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారా అంటే..అదే పనిలో ఉన్నాను అంటుంది. నేనే గెలవాలి అంటుంది మోనిత, న్యాయమే గెలుస్తుంది, మీ వైపు న్యాయం ఉంది అంటాడు ఆ లాయర్. ఇలా ఏదో మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మాట్లాడుకుంటారు. మోనిత ప్రియమణిని పిలిచి వెళ్లి బయలుదేరు..కార్తీక్ ఇంటికి వెళ్లాలి అంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయి భాగంలో కార్తీక్ బస్తీలో హెల్త్ క్యాంప్ పెడతాడు. అక్కడ ఎ‌వరో చిన్నబాబు తండ్రికోసం ఏడుస్తున్నాడని ఒక ఆవిడ చెబుతుంది. కార్తీక్ చిన్నపిల్లలు వదిలేసి అలా ఎలా వెళ్లాడు, అసలు మనిషేనా అతను అంటుంటాడు ఇంతలో దీప ప్రియమణి విత్ బాబు వస్తారు. ఇదే మాట నేను నిన్ను అనాలి, నన్ను నా బిడ్డను వదిలేశావు. నాకు అన్యాయం చేసి ఇక్కడకొచ్చి బిల్డప్ ఇస్తున్నావా అంటుంది. చూడాలి రేపు బస్తీలో ఏం జరగుబోతుందో. అది దీప అడ్డా కాబట్టి అందరు కలిసి మోనితను తన్నినా ఆశ్యర్యపోవక్కర్లా.!