కార్తీకదీపం ఎపిసోడ్ 1217: రోడ్డునపడ్డ కార్తీక్ కుటుంబం..కోడలిగా సౌందర్య ఇంట్లో అడుగుపెట్టిన మోనిత

-

కార్తీకదీపం ఈరోజ ఎపిసోడ్ లో ఏంటో డాక్టర్ బాబు, దీప, పిల్లలు రెండు బ్యాగ్ లు తీసుకుని రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుంటారు. పిల్లలు మనం టూర్ కి వెళ్తున్నట్లు నాన్నమ్మ, తాతయ్య బాబ్భైలకు ఎందుకు చెప్పలేదు అంటారు. వాల్లకు సప్రైజ్ ఇద్దాం అంటుంది దీప. మరి కారులో వెళ్లకుండా ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే..ప్రతిసారి విమానం ఎక్కేబదులు ఈసారి ఇలా నడుద్దాం అంటాడు కార్తీక్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ వస్తుండగా..మోనిత ఫోన్ చేస్తుంది. మీరు ఇక్కడే ఉండండి.ఇప్పుడే వస్తాను అంటాడు కార్తీక్.. మీరు ఎక్కడ ఉంటే..నేను అక్కడే ఉంటాను మిమ్మల్ని ఇక నేను వదిలిపెట్టను అంటుంది దీప.. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ.. మనం ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి వెళ్దాం..మన టూర్ కి ప్లానింగ్ ఏం ఉండదు అంటుంది దీప. కార్తీక్ ఆ ఫోన్ తీసుకెళ్లి రోడ్డుపక్కన విసిరేస్తాడు. అది రోడ్డుపక్కన ఉన్న ఓ వ్యక్తి చూస్తాడు. దీప వాళ్లు బస్సు ఆపి కార్తీక్ ని పిలుస్తారు. అందరూ బస్ ఎక్కుతారు. ఆ రోడ్డుపక్కన ఉన్న వ్యక్తి..వెళ్లి కార్తీక్ ఫోన్ తీసుకుని..ఈయనేంటి కావలనే ఫోన్ వదిలేసి వెళ్లాడు, ఎందుకు అనుకుంటాడు.

కట్ చేస్తే ప్రియమణి పడుకుని ఉంటే..మోనిత వచ్చి లేపుతుంది. ఏంటి ప్రియమణి అప్పుడే పడుకున్నాం అంటుంది. ఇప్పుడు టైం ఎంతైందో చూశారా అంటే..మన టైం బాగుందని చెప్పడానికి వచ్చాను అని..ప్రియమణితో ఏదో మ్యూట్ వాయిస్ లో చెప్తుంది. మీ పగ దీపమ్మ మీద కార్తీకయ్య మీద కాదుగా అంటే..ఇక్కడే నేను బ్రెయిన్ వాడాను..మగాడికి పెద్ద శిక్ష ఏంటో తెలుసా ప్రియమణి..కాళీగా ఉండటం..ఇంట్లో కాళీగా ఉంటే..చుట్టుపక్కల వారు అడిగే ప్రశ్నలకు విరక్తిచెందుతాడు…. అప్పుడు నా హాస్పటల్లోనే పెట్టుకుంటాను..మెల్లిమెల్లిగా బంధాలు బిగించి..దీపకు దూరం చేస్తాను అంటుంది.

తెల్లారి సౌందర్య, ఆనంద్ రావులు..పెద్దోడికి డబ్బులు ఇస్తే తీస్కోడు..5కోట్ల లోన్ ఇప్పించి..బిజినెస్ స్టాట్ చేయిద్దాం అనుకుంటూ మాట్లాడుకుంటారు. దీపకు ఈ మాట చెప్తే సంతోషిస్తుంది అని వంటగది వైపు చూస్తూ..దీపను పిలుస్తుంది సౌందర్య. ఎన్నిసార్లు పిలిచినా రెస్పాండ్ ఉండదు. కిచెన్ లో ఉందో లేదో సౌందర్య అని ఆనంద్ రావు అంటే..అది నా పెద్దకోడలు, అందరికంటే ముందు నిద్రలేచి, అందరి కంటే లేటుగా నిద్రపోతుంది అని పిలుస్తుంది. శ్రావ్య వచ్చి ఏంటి అత్తయ్య అంటే..దీపలేదా అని సౌందర్య అడుగుతుంది. .నాకు కిచెన్ లో కనిపించలేదు అంటుంది. వాకింగ్ కి వెళ్లి ఉంటారు, మనం వెళ్దాం పదా సౌందర్య అని ఆనంద్ రావు అనటంతో..వాళ్లు బయటకు వెళ్లబోతారు.

టీపాయ్ మీద లెటర్ చూసి శ్రావ్య చదివి అత్తయ్య, మావయ్య అని వాళ్లను పిలుస్తుంది. శ్రావ్య ఏడ్చుకుంటూ ఉండటంతో..ఆ లెటర్ సౌందర్య తీసుకుని చదువుతుంది. లెటర్ సారాంశం..ఇంట్లోంచి వెళ్తున్నాను, నేను కన్నందుకు, కట్టుకున్నందుకుదీప పిల్లలకు తప్పదుకదా, ఎక్కడికి వెళ్తానో, ఏం అవుతానో నాకు తెలియదు, పిల్లలు తెలియదు, నాకోసం వెతకొద్దు, నాకోసం బాధపడొద్దు, ఉన్నన్ని రోజులు అన్నిరకాలుగా నా వల్ల మీరు బాదపడ్డారు, జీవితంలో అలిసిపోయానో, ఓడిపోయానో నేను ఏమైపోతున్నానో నాకే అర్థంకాని పరిస్థితి..మమ్మల్ని లెక్కలోకి తీసుకోకండి, మీకు ఒకే కొడుకు అనుకోండి..ఒక్కడే మనవడు..దీపుగాడు అనుకోండి..ఒకే కోడలు శ్రావ్య అనుకోండి..నేను ఓడిపోయాను, అందుకే ఎవరికి మొఖం చూపించలేక వెళ్లిపోతున్నాను..మీ ఆరోగ్యం జాగ్రత్త, శ్రావ్య, ఆదిత్య, దీపులను బాగా చూసుకోండి..ఇట్లు మీకు ఎన్నో తలవంపులు తెచ్చిన, నిజంగా పెద్దోడు కాలేకపోయిన మీ పెద్దోడు. ఆ లెటర్ చదివి సౌందర్య, ఆనంద్ రావులు కుప్పకూలిపోతారు.

అన్నయ్య ఇలా చేయడమేంటి మమ్మీ, లెటర్ రాసి అన్నయ్య వెళ్లిపోతే అయిపోతుందా ఎక్కడున్నా వెతికి తీసుకువస్తాను అంటాడు. కావాలని దూరమైనవాళ్లను ఎలా పట్టుకుంటావు ఆదిత్య అంటాడు ఆనంద్ రావు. ఎవరికి కనిపించకుండా వెళ్లినవాళ్లు, ఎక్కడని వెతుకుతాం చెప్పండి..బావగారేంటి ఇలా చేసారు అని శ్రావ్య కూడా ఏడుస్తుంది. వాడు ఓడిపోయాడు అని సౌందర్య అంటే..దీప పక్కను ఉన్నంత వరకూ వాడు ఓడిపోడు, ఎన్ని కష్టాలు వచ్చినా పదకొండేళ్లు ఒంటరిపోరాటం చేసింది దీప..ఇప్పుడు కార్తీక్ పక్కన ఉంది..దీప పక్కన ఉన్ననని రోజులు కార్తీక్ ఓడిపోడు అంటాడు ఆనంద్ రావు.

ఇంకోవైపు కార్తీక్ కిందపడబోతుంటే..దీప పట్టుకుంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో మోనిత పిల్లోడ్ని తీసుకుని సౌందర్య ఇంటికి వస్తుంది. మీరే కావాలని కార్తీక్ ని ఎక్కడికో పంపించి నాటకాలు ఆడుతున్నారా అంటుంది. సౌందర్య ఏంటి కార్తీక్ ఇలా చేశావ్ అని ఏడుస్తుంది. ఇక్కడ దీపవాళ్లు ఏదో పాడుపడిన ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంటి పక్కన ఆవిడ ఎవరు మీరు..ఇక్కడకు ఎందుకు వచ్చారు అంటే..పనికోసం వచ్చాం అంటుంది దీప. ఆ ఇళ్లు ఎవరి ఆదీనంలో ఉందో తెలుసా..మీకు తెలియక వచ్చారేమో..వెంటనే వెళ్లిపోండి అంటుంది. కానీ దీప వాళ్లు ఆ పాడుపడిన ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్తారు. అసలు సీరియల్ ఏంటి ఇలా చేశారు..ఈ లైన్ తో ఇక లాగితే సిరయల్ సాగిపోతుందిగా.

Read more RELATED
Recommended to you

Exit mobile version