కార్తీకదీపం సెప్టెంబర్ 9 ఎపిసోడ్‌ 1140 : దీపకు రివ్వాలర్ గురిపెట్టిన మోనిత..కోర్టుకు వెళ్లిన కార్తీక్

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్.. దీప కోసం వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని మీరు ఈ ఆసుపత్రికి డాక్టర్ గా రాలేదు ఒక ఖైదీగా వచ్చారు. మిమ్మల్ని అలాఎలా వెళ్లనిస్తాం అని కార్తీక్ ను లోపలికి పంపిస్తారు. రత్నసీతకు మౌనిత మేడం దీపకు దొరికిపోయి ఉంటుందా అని అనుమానం వస్తుంది. ఇంతలో మోనిత రత్నసీతకు కాల్ చేసి కార్తీక్ ను కోర్టుకు తీసుకెళ్లారా అని అడుగుతుంది. కాసేపట్లో రోషిణి మేడమ్ వస్తారు అని చెప్తుంది. కార్తీక్ ఏం చేస్తున్నాడు అంటే..దీప కనపడటం లేదని టెన్షన్ పడుతున్నారు అని రత్నసీత చెప్తుంది. వాడికి దాని పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో అని మోనిత అంటుంది. దీప మోడమ్ ఎక్కడున్నారు అని రత్నసీత అడిగితే..కాసేపట్లో నాచేతుల్లో చావబోతుంది అని చెప్పి మోనిత ఫోన్ పెట్టేస్తుంది.

ఇటుపక్క కారులో ఉన్నదీప ఇవ్వాల మోనిత మిస్ అవ్వకూడదు వారణాసి. ‍డాక్టర్ బాబుని జైలుకి వెళ్లకుండా కాపాడాలంటో మోనత బతికే ఉందని బుజువుచేయాలి అంటుంది. వారణాసి అలాగే అని చెప్పి అక్కా పెట్రోల్ ఐపోవస్తుంది అంటాడు.

ఆసుపత్రిలో ఉన్న కార్తీక్ చాలా టెన్షన్ పడతాడు. దీప కోసం వెతికి వస్తా అని బయటకువెళ్తా అంటాడు. కానీ అక్కడ ఉన్న పోలీసులు వెళ్లనివ్వరు. ఇంతలో రోషిణి ఏంట్రీ ఇస్తుంది. కార్తీక్.. దీప కనిపించటం లేదని జరిగిదంతా చెప్తాడు. తనేమైనా చిన్నపిల్ల కనిపించకుండా పోవటానికి అని రోషిణి అంటుంది. ఆ మోనితే ఏదో చేసి ఉంటుంది అని కార్తీక్ అంటాడు. మోనిత చనిపోయింది అని అరుస్తుంది. నువ్వే చంపేశావ్ అంటుంది రోషిణి. ఒక్కరోజు వాయిదా తీసుకోండి మోడమ్..దీప ఎక్కడుందో కనిపెట్టండి అని బతిమిలాడతాడు. రోషిణి ససేమిరా అంటుంది.

కార్తీక్ పదేపదే మోనిత బతికేఉంది..అందుకు నేనే సాక్ష్యం అంటాడు. నీ సాక్ష్యాలను నేనెప్పుడో పంచనామా చేశా అంటూ రోషిణి చెప్తుంది. భార్య భర్తలిద్దరు కలిసి మోనిత బతికే ఉందని చెప్పి అది నిజమని నమ్మి అనవసరంగా మా స్టాఫ్ ని అనుమానించా. టీ కొట్టు దగ్గర కూడా ఎంక్వైరీ చేశాను. వచ్చింది బసవయ్య కూతరే అంటుంది. కార్తీక్ వాదిస్తాడు. డా. రీనా వేషంలో వచ్చింది కూడా మోనితే అని చెప్పేస్తాడు. జరిగిదంతా చెప్తాడు. రోషిణి అస్సలు వినదు. సాక్ష్యం అడుగుతుంది. నేనే సాక్ష్యం అని కార్తీక్ అంటాడు. ముద్దాయి చెప్తే కుదరదు అంటుంది. నా భార్య కూడా సాక్షి అంటాడు. సోదమ్మ వేషంలో వచ్చింది అంటాడు. మోనిత కనిపిస్తే మాకెందుకు చెప్పలేదు అని రోషిణి అడుగుతుంది. మోనిత బెదిరింపులను కార్తీక్ రోషిణికి చెప్తాడు. ఇదంతా మాకెందుకు చెప్పలేదు..మాకు చెప్తే ఒక్కనిమిషంలో పట్టుకుని లోపలేసేదాన్ని కదా అంటుంది. సరే ఇదంతా కాదు మేడమ్.. దీప ఎక్కడుందో వెతికించండి అని బతిమిలాడతాడు.

రోషిణి..నాకు దీప మీద ద్వేషం ఏం లేదు.. గౌరవం ఉంది. నాకు నా డ్యూటీఏ ముఖ్యం అంటుంది. చిర్రెత్తిపోయిన రోషిణి బలవంతంగా కార్తీక్ ను కారుఎక్కిస్తుంది. ఇంకోవైపు మోనిత ఒక చోట కారు దిగుతుంది. థ్యాంక్యూ బ్రో నేను వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను ఒకవేళ వాళ్లు నిన్ను పట్టుకని అడిగినా నిజం చెప్పకు అని చెప్పి వెళ్తుంది. దీప కారులో పెట్రోల్ ఐపోవటంతో రోడ్డుపక్కన నిలబడతుంది. కార్తీక్ వెళ్లటం దీప చూస్తుంది. మోనిత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్లాన్ అంతా మిస్ అయిందని ఓ ఫీల్ అవుతూ ఉంటుంది. గమ్యం లేని ప్రాయణం అయిపోయింది అనుకుంటుంది. ఇంతలోనే కార్తీక్ వాళ్ల వెహికల్స్ ని మోనిత చూస్తుంది. వెళ్లిపోతున్నావా కార్తీక్ అంటూ బాధపడుతుంది.

కొంచెం ముందెకెళ్తే..దీప కూడా మోనితకు కనిపిస్తుంది. చెట్టువెనక ఉండి మోనిత చూస్తుంది. ఒంటరిగానే దొరికింది కదా అనుకుని చంపడానికి గన్ బయటకు తీస్తుంది.

ఇంకోవైపు కార్తీక్ కోర్టుకు వస్తాడు. కోర్టులో ఉన్న కార్తీక్ కుటుంబం కార్తీక్ ను చూడగానే నీ కోసమే కలవరిస్తున్నార్రా అని సౌందర్య అంటుంది. ఏం పర్వాలేదు జైలుకి వెళ్లే ముందు పదినిమిషాలు టైం ఇస్తారు అని రోషిణి అంటుంది. ఆనంద్ రావు గుండెల్లో దడగా ఉంది అంటాడు. కార్తీక్ చెక్ చేస్తాడు. శిక్ష పడుతుందని భయంగా ఉందిరా అంటాడు. ఆదిత్య ఫోన్ తీసుకుని ఫార్మసిస్ట్కి మెసేజ్ చేశాను మందులు తెస్తారు అంటాడు కార్తీక్. సౌందర్యకు నేను మీ సుపుత్రుడిని మమ్మీ అంటాడు. దీప మోనితను పట్టుకోడానికి వెళ్లింది..ఏం జరుగుతుందో భయంగా ఉంది అంటాడు. ఇంతలో రోషిణి కార్తీక్ ను తీసుకెళ్తుంది.

సౌందర్యకు ఏం అర్థంకాదు. మోనితను వెతకడానికి వెళ్లిందా అనుకుంటుంది. ఇంకోవైపు దీప వారణాసి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.