నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తారు.. అందులో కొంతమంది చికెన్ కు పెరుగును కలిపి తీసుకుంటారు.. చికెన్‌లో ప్రోటీన్లు, అనేక రకాల పోషకాలు ఉంటాయి. మీరు దానిని సరిగ్గా నిల్వ చేస్తే.. మీరు దానిని చాలా రోజులు ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడం సులభం, అందుకే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కానీ తరచుగా ఫ్రిజ్ లో నిల్వ చేయడానికి వచ్చినప్పుడు.. ప్రజలు పొరపాటు చేస్తారు.. పచ్చి మాంసాన్ని అలానే కాకుండా ఉడికించిన చికెన్ లేదా మెరినేట్ చేసిన చికెన్ 3 నుంచి 4 రోజులు నిల్వ చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు..
వేసవి కాలంలో చికెన్‌ను నిల్వ ఉంచే సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మనం చికెన్‌ని ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చికెన్ ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.. ఇకపోతే అసలు విషయానికొస్తే.. చికెన్‌ని పెరుగు తో కలిపి మ్యారినేట్ చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇందుకు బదులుగా చాలా మంచిది.. దీనితో చికెన్ కర్రీ లేదా మరేదైనా రెసిపీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా నిల్వ చేయడానికి ఫ్రిజ్ ఉపయోగించుకోవచ్చు… పెరుగులో కాల్షియం, విటమిన్ డి వంటి పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి.
కండరాలకు ఏది మంచిది. మరోవైపు, చికెన్‌లో చాలా ప్రోటీన్ ఉంటుంది..రెండు కలిపి తీసుకున్నా ఎటువంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు… ఇకపోతే టెస్ట్ బాగుంది కదా అని ఫుల్లుగా కుమ్మడం తగ్గించాలి.. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం.. ఎక్కువైతే విషం గుర్తుపెట్టుకోండి..