మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన డాక్యూమెంట్స్ లలో ఆధార్ కార్డు ఒకటి.. ఆ తర్వాత మనీలావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి..ఆధార్ కార్డు, పాన్ కార్డు విషయంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తున్నారు. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతా స్థంభించిపోతుంది. మార్చి 31లోగా మీ పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే పాన్ చెల్లుబాటు కాదు. దీంతో లావాదేవీలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
మీ పాన్ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ముందుగా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. పాన్ అనుసంధానం ఈ గడువు మార్చి 31, 2023 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ గడువు పెంచినా.. ఏప్రిల్ 1, 2022 నుండి మీరు మీ పాన్ని ఆధార్‌తో లింక్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ మార్చి 29, 2022 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చెయ్యడానికి ఈ నెల 31 వరకు టైమ్ ను పొడిగించారు..ఇకపోతే జూలై 1, 2022 తర్వాత లింక్ చేసినట్లయితే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గడువులోగా అనుసంధానం చేయకపోయిన కార్డు యాక్టివ్ గా ఉన్నా కూడా ఫెనాల్టీ పడుతుంది..
మీ పాన్ కార్డ్ చెల్లుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి..
ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లండి.
ఆ తర్వాత ‘వెరిఫై యువర్ పాన్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
మీరు సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు మరొక పేజీకి వెళ్తారు. అక్కడ మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయాలి. (OTPని స్వీకరించడానికి మీ మొబైల్ నంబర్ మీ పాన్‌కార్డుకు లింక్ అయ్యి ఉండాలి.)
అందుకున్న OTPని నమోదు చేసి, ‘వాలిడేట్’పై క్లిక్ చేయండి.
మీ పాన్ కార్డ్ సమాచారం డూప్లికేట్ చేయకపోతే చివరి పేజీలో పాన్‌కార్డు చెల్లుబాటు ఉందని, అలాగే వివరాలు పాన్ ప్రకారం ఉన్నాయని స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అలాగే ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నా తెలిసిపోతుంది. మీరు ఒకే వ్యక్తిగత సమాచారంతో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను నమోదు చేసుకున్నట్లయితే మరింత సమాచారం ఇవ్వాలని అక్కడ కనిపిస్తుంది..మీ పూర్తి వివరాలను అందులో నమోదు చెయ్యాలి..