అమెజాన్‌ కొన్ని వస్తువులను రిటర్న్‌ తీసుకోకుండానే డబ్బులు రిఫండ్‌ చేస్తుంది..ఎందుకు?

-

ఆన్‌లైన్‌ వచ్చాక..ఎక్కడ తయారైన వస్తువులు అక్కడ ఉండటంలేదు.. ఇంతక ముందు ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ స్పెషల్‌ ఏంటో తెలుసుకుని మరీ గుర్తుగా తెచ్చుకునే వాళ్లం.. కానీ ఆన్‌లైన్‌ మార్కెట్‌ వచ్చాకా.. అవి మనం ఇంట్లో ఉండి కూడా ఆర్డర్‌ పెట్టుకోవచ్చు.. మళ్లీ ఇక్కడి నుంచి మోసుకెళ్లాలా అనేలా మారిపోయింది. నచ్చితే ఉంచుకుంటాం.. నచ్చకుంటే రిటర్న్‌ పెడతాం..పైసాతో మన డబ్బులు మనకు వచ్చేస్తాయ్‌.. ఇక బాధేముంది..! మీరు గమనించే ఉంటారు..అమెజాన్‌లో కొన్ని వస్తువులను రిటర్న్‌ పెట్టలేం.. అవి నచ్చకున్నా మన దగ్గరే ఉంచుకోవాలి. కానీ వాటి డబ్బులు మాత్రం కంపెనీ తిరిగి ఇచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా..? అసలు కంపెనీ ఇలా ఎందుకు చేస్తుంది..?ఇలా చేయడం వల్ల కంపెనీకి నష్టమే కదా.. మరి దీని వెనుక ఉన్న కథేంటో చూద్దామా..!!
అమెజాన్ లో చాలామంది తక్కువ రేటు వస్తువు నుంచి చాలా ఖరీదైన వస్తువులు వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు దారులు కొనుగోలు చేసే చిన్న చిన్న వస్తువులను ఒకసారి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల గాని, డామేజ్ వల్ల గాని తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ ప్రోడక్ట్‌కు గాను అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ మన సొమ్ముని మనకు తిరిగి రెండు మూడు రోజుల వ్యవధిలో రిఫండ్ చేస్తుంది. ఇలా ఇచ్చిన వస్తువు సొమ్ము రిఫండ్ చేయడానికి అమెజాన్ సంస్థ ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తుంది. ఏంటంటే.. ఖరీదు తక్కువ గల వస్తువులను అమెజాన్ లక్షల ప్రొడక్ట్స్‌ని రిటన్ తీసుకోకుండానే పడవేస్తుంది.
ఎందుకంటే ఆ వస్తువు కొన్న వెల దాన్ని పంపించడానికి అయ్యే ఖర్చు కన్నా, ఆ వస్తువు తిరిగి సెల్లర్‌కి పంపించడానికే ఎక్కువ ఖర్చు అవుతుందట.. అందువల్లనే రిటన్ తీసుకున్న ప్రోడక్ట్‌ని తిరిగి వ్యాపారికి పంపడం కన్నా పడవేయడం మంచిదని అమెజాన్ భావిస్తుంది. అందుకే తక్కువ ఖరీదుగల వస్తువులకు కంపెనీ కొన్నిసార్లు రిటర్న్‌ ఆప్షన్‌ తీసేస్తుంది..లేకుంటే రిటర్న్‌ తీసుకోకుండా డబ్బులు రిఫండ్‌ చేస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా..?

Read more RELATED
Recommended to you

Latest news