ఏపీ 10వ త‌ర‌గ‌తి పరీక్షల టైం టేబుల్ మొదలైన వివరాలివే…!

-

ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ఏపీ లో స్టార్ట్ అవ్వనున్నాయి. మే 9 వరకు వీటిని నిర్వహించనున్నారు. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు ఈ పరీక్షలు వ్రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరగనున్నాయి.

పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. ఆలస్యం అయితే అనుమతించం అని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానంద రెడ్డి తెలిపారు.

మంచినీటి సదుపాయం, ఏఎన్‌ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. అలానే కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 292 సిట్టింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. అలానే పరీక్షలకు సంబంధించిన సామగ్రిని కూడా పంపించడం జరిగింది.

అదే విధంగా ఒక్కో రూముకు 16 మంది చొప్పున ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.

ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్:

ఏప్రిల్ 27- తెలుగు
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్
మే 2- గణితం
మే 4- సైన్స్ పేపర్‌-1
మే 5- సైన్స్ పేపర్-2
మే 6- సోషల్.

Read more RELATED
Recommended to you

Latest news