కేవీసి పథకంలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? బెనిఫిట్స్ ఇవే..

-

జూలై 1 నుంచి బ్యాంకు సేవలు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే.. అయితే డిపాజిట్ లపై పెట్టుబడి కోసం చాలా మంది వెతుకుతారు. చక్రవడ్డీ ప్రయోజనం ఇచ్చే స్కీముల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి కిసాన్‌ వికాస్‌ పత్ర ఒక మంచి ఆప్షన్‌ ఈ ఖాతాను వయోజనులు తెరవొచ్చు. పిల్లల పేరుతో పెద్దవాళ్లూ నిర్వహించొచ్చు. ముగ్గురు వరకు జాయింట్‌ అకౌంట్‌ తీసుకోవచ్చు..

కేవిసీ వడ్డీ రేటు?

2022, సెప్టెంబర్‌ 30 నాటికి కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీరేటు 6.9 శాతంగా ఉంది. ఏటా చక్రవడ్డీ చెల్లిస్తారు. వెయ్యి రూపాయల కనీస పెట్టుబడితో ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితేమీ లేదు. రూ.100 పెంచుకుంటూ ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద మినహాయింపులు ఇవ్వరు. మెచ్యూరిటీ తర్వాత సొమ్ము విత్‌డ్రా చేస్తే మూలం వద్ద పన్ను కట్ చేసి ఇవ్వరు.

కిసాన్‌ వికాస్‌ పత్రాల్లో పెట్టుబడి పెట్టిన సొమ్మును మెచ్యూరిటీ కన్నా ముందు తీసుకొనేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఖాతాదారు మరణిస్తే, తనఖా పూర్తయితే, కోర్టు ఆర్డరిస్తే మెచ్యూరిటీ పూర్తవ్వకముందే డబ్బు ఇస్తారు. ఇక అత్యవసర సందర్భాల్లో రెండేళ్ల ఆరు నెలల తర్వాత, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఖాతా బదిలీ చేసినప్పుడు డబ్బులను పొందవచ్చు..

కేవీసి పత్రాలను తాకట్టు పెట్టవచ్చా..?

కొన్ని అత్యవసర సమయాల్లో పత్రాలను తాకట్టు పెట్టవచ్చు..ఇందుకు సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్‌, ఆర్బీఐ, షెడ్యూలు బ్యాంకు, కో ఆపరేటివ్‌ సొసైటీ, కో ఆపరేటివ్‌ బ్యాంకు, కార్పొరేషన్, ప్రభుత్వ కంపెనీ, లోకల్‌ అథారిటీ, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ వద్ద తనఖా పెట్టొచ్చు..అత్యవసర పరిస్థితిలో ఒకరి నుంచి మరొకరికి బదిలీ చెయ్యవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news