ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారా..? ప్రభుత్వం అందించే ఈ టాప్ 5 స్కీములతో షురూ చేసేయండి మరి..!

-

చాలా మంది ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? డబ్బులు కోసం ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్కీముల గురించి చూడాలి. ప్రభుత్వం అందించే టాప్ ఐదు స్కీములు ఇవి మరి ఈ స్కీముల వివరాలు.. ఈ స్కీముల ద్వారా లోన్ ఎలా తీసుకోవచ్చు అనే వివరాలను ఇప్పుడు చూద్దాం భారత ప్రభుత్వం అందించే టాప్ లోన్ స్కీమ్స్ ఇవే.

MSME లోన్ స్కీమ్:

ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ బాగా ప్రజాదరణ పొందింది. దరఖాస్తు చేసుకున్నాక ఈ స్కీమ్ ద్వారా లోన్ ని పొందవచ్చు. బడ్జెట్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాన్ని పొందారు. మహిళా పారిశ్రామికవేత్తలకు 3% రిజర్వేషన్‌ కూడా.

ముద్ర యోజన స్కీమ్:

ముద్ర రుణ పథకం ద్వారా చిన్న వ్యాపారాలకు లోన్ సౌకర్యం ని కేంద్రం కలిపిస్తోంది. చిన్న మరియు సూక్ష్మ స్థాయి వ్యాపారాల కోసం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. ఈ ముద్ర లోన్ మూడు రకాలుగా ఉంటుంది. అవేమిటో కూడా చూద్దాం.

శిశు లోన్: 50,000 దాకా లోన్ వస్తుంది.
కిషోర్ లోన్: 5,00,000 దాకా లోన్ వస్తుంది.
తరుణ్ లోన్: 10,00,000 దాకా లోన్ వస్తుంది.

క్రెడిట్-లింక్డ్ కాపిటల్ సబ్సిడీ స్కీమ్:

వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా లోన్ ని పొందవచ్చు. భారత ప్రభుత్వంచే CLCSS పథకం ప్రాథమికంగా MSMEలలో టెక్నాలజీ అప్ గ్రేడ్స్ కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.

సపోర్ట్ స్కీమ్స్ ఫ్రొం ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (NSIC):

NSIC అనేది MSME సెక్టార్ కింద భారత ప్రభుత్వ ISO-సర్టిఫైడ్ ఎంటర్‌ప్రైజ్. ఈ స్కీమ్ ద్వారా కూడా లోన్ పొందొచ్చు.

ఉద్యోగిని:

ఈ స్కీమ్ కూడా ప్రభుత్వమే తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ కూడా వ్యాపారాలని స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news