విశాఖపట్నం నుండి అస్సాం, మేఘాలయ.. పూర్తి వివరాలు ఇవే..!

మీరు ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీని చూడండి. అస్సాం, మేఘాలయ వంటి ప్రాంతాలను ఈ టూర్ ప్యాకేజీ ద్వారా చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌టీసీటీ విశాఖపట్నం నుంచి ఈ టూర్ ని అందిస్తోంది. అస్సాం, మేఘాలయ వంటి ప్రాంతాలు దీనిలో కవర్ అవుతాయి. కనుక ఎవరైనా మేఘాలయ, అస్సాం వెళ్లాలనుకుంటే ఈ ప్యాకేజీ ద్వారా వెళ్లి వచ్చేయచ్చు. మేఘాలయ , అస్సాం టూర్ వారం రోజులు ఉంటుంది. అంటే ఆరు రాత్రులు ఏడు రోజులు. చిరపుంజీ, గువాహటి, కజిరంగ, షిల్లాంగ్, మౌలీనాంగ్ ఇవన్నీ కూడా చూసి వచ్చేయండి.

మ్యాజికల్ అస్సాం మేఘాలయ విత్ కజిరంగ పేరు తో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను అందుబాటులో ఉంచింది. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీ కి రూ. 54,545 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 39,810 కట్టాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 37,880 పడుతుంది. 5 నుంచి 11 ఏళ్లు పిల్లలకి అయితే రూ. 34,460 చెల్లించాలి. ఇక చైల్డ్ విత్‌ఔట్ బెడ్ కి అయితే మీరు రూ. 14740 కట్టాలి. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూసి బుక్ చేసుకోవచ్చు.