ఫ్రీగా పాన్ కార్డుని పొందే ఛాన్స్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

-

ట్రాన్సాక్షన్స్ జరిపే వారికి పర్మనెంట్ అకౌంట్ నెంబర్, గుర్తింపు కార్డు తప్పనిసరి ప్రూఫ్ గా మారింది. వ్యక్తులు, సంస్థలకు ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డుని జారీ చేస్తూ ఉంటుంది. ట్రాన్సాక్షులను ట్రాక్ చేయడానికి ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అవసరం. రెగ్యులర్ పద్ధతిలో ఫిజికల్ పాన్ కార్డు పొందాలంటే కొంచెం సమయం పడుతుంది. డిపార్ట్మెంట్ కార్డును ప్రింట్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. అయితే ఇలా కాకుండా తక్కువ సమయంలో ఫ్రీగా ఎలక్ట్రిక్ పాన్ కార్డుని తీసుకోవచ్చు.

ఆధార్ నెంబర్ సహాయంతో ఆన్లైన్లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ తో లింక్ అయిన ఆధార్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఈ కేవైసీ వివరాలను విశ్లేషించి పది డిజిట్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ జనరేట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే పీడీఎఫ్ రూపంలో ఈ పాన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. పాన్ కార్డు అవసరమయ్యే అన్ని చోట్ల కూడా ఇది చెల్లుతుంది. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి పాన్ కార్డు లేనట్లయితే ఈ పాన్ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఆన్లైన్లో ఈ పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముందుగా ఇన్కమ్ టాక్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఈ ఫైలింగ్ పోర్టల్ లో హోం పేజీలోకి వెళ్లి ఇన్స్టంట్ ఈ పాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఈ పాన్ పేజీలోకి వెళ్ళాక గెట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి చెక్ బాక్స్ పై క్లిక్ చేసి కన్ఫామ్ చేయాలి.
తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేస్తే ఓటిపి పేజీ లోకి వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి అందులో చూపించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదువుకుని ఆ తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి.
క్లిక్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తై మీకు ఒక మెసేజ్ వస్తుంది.
అక్నాజ్మెంట్ నెంబర్ ఇందులో ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ పాన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version