రెస్టారెంట్లో సర్వీసు చార్జీలు వేస్తే..వెంటనే ఇలా చెయ్యండి..

-

ఎప్పుడైనా సరదాగా కుటుంబంతో కలిసి తినడానికి ఏ రెస్టారెంట్ కో, హోటల్ కో వెళ్ళిన వారికి సర్వీసు చార్జీలు పేరుతో చుక్కలు చూపిస్తున్నారు హోటల్ యాజమాన్యం.బిల్లు చెల్లించాల్సిందిబోయి, దానికి తోడు సర్వీసు ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ హోటల్, రెస్టారెంట్లకు వెళ్లినా అక్కడ ఆటోమాటిక్‌గా సర్వీసు ఛార్జీలను విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులపై డిపాల్ట్‌గా సర్వీసు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దాంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఈ విషయం పై నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. హోటల్‌ లేదా రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.హోటళ్లు, రెస్టారెంట్లు ఆటోమేటిక్‌గా సర్వీస్‌ ఛార్జీలు విధించడం లేదా ఫుడ్‌ బిల్లులపై డిఫాల్ట్‌గా వసూలు చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. సర్వీస్ ఛార్జీలు చెల్లించమని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కస్టమర్‌లను బలవంతం చేయలేమని పేర్కొంది. అయితే, కస్టమర్ తనకు కావాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించవచ్చు. అది పూర్తిగా కస్టమర్ ఇష్టం అని చెప్పింది.

ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా సేవను పొందినప్పుడు వినియోగదారులు కొంత ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. దీనినే సర్వీస్ ఛార్జ్ అని పిలుస్తారు. హోటల్‌లు లేదా రెస్టారెంట్‌లలో కస్టమర్‌లకు ఆహారం లేదా మరేదైనా సర్వీసులను అందించినందుకు ఛార్జీ విధిస్తున్నారు. CCPA దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఛార్జ్‌ అనేది బిల్లు కింద ఉంటుంది. సాధారణంగా సర్వీసు ఛార్జ్ అంటే 5 శాతం వరకు విధిస్తారు. కానీ, కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు సర్వీసు చార్జీలను తీసి వేసిన సంగతి తెలిసిందే..అయిన సర్వీసు చార్జిలు వసూల్ చేస్తె వెంటనే ఫిర్యాదు చేయవచ్చు…బిల్లుపై వేసిన సర్వీస్ ఛార్జీని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్‌లోని సిబ్బందిని అభ్యర్థించవచ్చు.నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ లో ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు వినియోగదారుల కమిషన్‌కు లేదా ఆన్‌లైన్‌లో edaakhil పోర్టల్ ద్వారా edaakhil.nic.inలో ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్ NCH మొబైల్ యాప్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. CCPA ద్వారా విచారణ జరపవచ్చు. తదుపరి చర్యల కోసం కస్టమర్ సంబంధిత జిల్లా, జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును సమర్పించవచ్చు. [email protected]కి ఈ-మెయిల్ పంపడం ద్వారా వినియోగదారు నేరుగా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news