మీ PPF అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయ్యిందా..? ఇలా మళ్ళీ ప్రారంభించచ్చు..!

-

మనకి ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. వీటిలో డబ్బులు పెట్టడం వలన మంచిగా రాబడి వస్తుంది. అయితే మనకి వుండే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా బాగా పాపులర్. దీనిలో డబ్బులు పెడితే కూడా మంచిగా లాభం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఏడాదికి లక్షన్నర వరకు మనం ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

money
money

వడ్డీ ఆదాయానికి, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు. అయితే ఈ స్కీమ్ లో ఏడాదికి రూ.500 తప్పనిసరిగా ఇన్వెస్ట్ చెయ్యాలి. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో మీరు రూ.500 డిపాజిట్ చెయ్యలేదు అంటే అప్పుడు మీ యొక్క పీపీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయ్యిపోతుంది.

మీ అకౌంట్ కూడా ఇన్ యాక్టివ్ అయ్యిపోయిందా..? అయితే మళ్ళీ ఇలా యాక్టివ్ చేసుకోండి. మళ్ళీ మీ అకౌంట్ ని యాక్టివేట్ చెయ్యాలంటే కొంత ఫైన్, కొంచెం పేపర్ వర్క్‌తో యాక్టివేట్ చెయ్యచ్చు. ఎక్కడైతే పీపీఎఫ్ అకౌంట్ తెరిచారో అక్కడికి అంటే పోస్టాఫీసు లేదా బ్యాంకు వద్దకు మీరు వెళ్ళాలి.

అదే విధంగా ఎన్ని ఏళ్లు అయితే ఇన్వెస్ట్ చేయలేదో ఆ అరియర్స్ డబ్బులను చెల్లించాలి. దానితో పాటుగా ప్రతి ఏడాది పెనాల్టీ కింద రూ.50ను చెల్లించాలి. ఇలా మీరు వీటిని పూర్తి చేసేస్తే అప్పుడు మీ పీపీఎఫ్ ఖాతా యాక్టివ్ అవుతుంది. యధావిధిగా కొనసాగించచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news