ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. నేటి కాలంలో ఆధార్ కార్డ్ ఎన్నో వాటికి ఉపయోగ పడుతోంది. ఏదైనా ప్రభుత్వ పథకం పొందాలన్నా లేదంటే ప్రయాణ సమయంలో, బ్యాంక్ ఖాతా కోసం ఇలా చాలా వాటికి అవసరం అవుతోంది. కనుక ఆధార్ కార్డు ని జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ఎక్కడైనా పోతే భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక మీ ఆధార్ పోతే మళ్ళీ పొందవచ్చు. ఆ ఫెసిలిటీ ని కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఆధార్ పోతే ఎలా మళ్ళీ దాన్ని పొందొచ్చు అనేది ఇప్పుడే చూసేద్దాం. ఆధార్ కార్డు పోయినట్లయితే, ఈజీగానే దానిని మళ్లీ తయారు చేసుకోవచ్చు. రూ.50 మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ముందు UIDAI అధికారిక వెబ్‌సైట్ ని ఓపెన్ చేసేయాలి .
ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్ ని ఇచ్చేసి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
ఆ తర్వాత Said ఓటీపీ పైన నొక్కండి.
మీ నంబర్ రిజిస్టర్ కానట్లయితే, My Mobile Number is not Registered పైన నొక్కండి. OTP కాల్ పొందండి.
ఇప్పుడు ఓటీపీని నమోదు చేసి.. పదం, షరతును చదివి, క్లిక్ చేయండి.
ఇక్కడ ఆధార్ వివరాలన్నీ కన్పిస్తాయి.
మేక్ పేమెంట్ ఎంపికను ఎంచుకుని, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చెల్లించాలి.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో రసీదు వస్తుంది.
స్టేటస్ ని చూడటానికి ఎస్‌ఎంఎస్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది.