కేంద్రం అదిరే స్కీమ్.. నెలకు రూ.1000 కడితే రూ.12 లక్షలు వస్తాయి..!

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ స్కీమ్స్ లో కనుక డబ్బులు పెడితే మంచిగా లాభాలను పొందొచ్చు. అయితే ఆకర్షణీయ రాబడి పొందాలని భావిస్తే మాత్రం మీరు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. వీటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF ఒకటి. దీనితో మంచిగా రాబడి వస్తుంది.

అలానే ఇతర ప్రయోజనాలు కూడా మనం ఈ స్కీమ్ తో పొందొచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రూ.500 కనీస పెట్టుబడితో పీపీఎఫ్ పథకంలో చేరచ్చు. దగ్గరిలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళితే చాలు ఖాతా ఓపెన్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో నెలకు రూ.12,500 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే రూ.500 ఇన్వెస్ట్ చేసినా కూడా అకౌంట్ నడుస్తుంది. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ రేట్లు ప్రతీ మూడు నెలలకీ మారుతూ ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు.

కావాలంటే మరో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోచ్చు. మెచ్యూరిటీ సమయంలో విత్‌డ్రా చేసుకునే డబ్బులపై కూడా ఎలాంటి పన్ను పడదు. నెలకు రూ.1000 పెడితే 15 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ.3.25 లక్షలు వస్తాయి. తీసుకోకుండా మరో ఐదేళ్ల పాటు డబ్బులు పెడితే అప్పుడు రూ.5.3 లక్షలు లభిస్తాయి. మరోసారి ఎక్స్టెండ్ చేసుకుంటే రూ.12.36 లక్షలు వస్తాయి.