పోస్టాఫీసులో అద్బుతమైన స్కీమ్..నెలకు రూ.5 వేలు పొందే అవకాశం..

-

మనం ఎందులోనైనా పెట్టుబడి పెడితే పది రూపాయలు వస్తుందనే ఆలొచిస్తారు. ఏదైనా వ్యాపారం చేస్తున్న కూడా సంతృప్తికరమైన లాభాలు రావడం లేదు..కానీ పోస్టాఫీసులో పెట్టె పెట్టుబడిలో మాత్రం మంచి లాభాలను పొందవచ్చు..ఎక్కువ మొత్తంలో లాభం వచ్చే విధంగా పోస్టాఫీసుల్లో అనేక రకాలు స్కీంలు ఉన్నాయి..

అందులో ముఖ్యంగా మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో పెళ్లైన వాళ్లు ఇన్వెస్ట్ చేస్తే రెట్టిపు లాభం పొందే అవకాశం ఉంటుంది..

ఇందులో సింగిల్ అకౌంట్ తో పాటు, జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు.ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఒకే ఖాతాలో రూ.4.5 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లు 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 5,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది..ఖాతా తెరిచిన తేదీ నుండి ప్రతి నెలాఖరులో మరియు ఖాతా మెచ్యూరిటీకి వచ్చే వరకు వడ్డీ చెల్లించబడుతుంది. ఖాతాదారు నెలవారీ వడ్డీని క్లెయిమ్ చేయకపోతే, వడ్డీకి తదుపరి వడ్డీ లభించదు..ఇది తప్పక గమనించాలి.

వడ్డీని సంపాదించడానికి అదే పోస్టాఫీసు లేదా ECSలో సేవింగ్స్ ఖాతాలోకి ఆటో క్రెడిట్‌ని ఎంచుకోవడం మంచిది. సంవత్సరానికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 59,400 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు 6.6 శాతం వడ్డీ వస్తుంది.ఖాతా తెరిచినప్పటి నుంచి వడ్డీ అనేది వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news