నెలకు రూ.10000 కడితే.. 32 లక్షలు బెనిఫిట్..!

-

పిల్లల భవిష్యత్‌ కోసం తల్లి దండ్రులు వాళ్ళు పుట్టగానే ఒక ప్లాను చేసి పెడతారు. ఆ ప్లాన్ ప్రకారమే బేబీ చదువు, పెళ్లికి కావాలసిన ఖర్చులు ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవడం మంచిది.ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మీ పిల్లల జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు సరైన సమయంలో పెట్టుబడి ప్రణాళికను రూపొందించవచ్చు. దీని కోసం తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకునే పథకాలు కూడా ఉన్నాయి.

అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..ఈ స్కీమ్ పిల్లల భవిష్యత్‌ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. మైనర్ పిల్లల కోసం PPF ఖాతాను తెరిచి, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. మీరు ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా వారు పెద్దయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులు అందుకోవచ్చు.. ఈ అకౌంట్ కు వయస్సు నిమిత్తం లేదు.ఖాతాను తెరవడానికి ఇప్పుడు బ్యాంక్ కు వెళ్ళాల్సిన పనిలేదు. ఇప్పుడు దీనిని ఫారమ్ 1 అని పిలుస్తారు. మీరు సమీపంలో ఉన్న ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని PPF ఖాతాను తెరవవచ్చు.

ఈ అకౌంట్ ను ఎలా తెరవాలి అంటే?

ఖాతా తెరవడానికి మీరు మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ వివరాలను చిరునామా రుజువుగా ఇవ్వవచ్చు. మీరు మీ మైనర్ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. ఖాతా తెరిచే సమయంలో మీరు కనీసం రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పిల్లల పేరు మీద PPF పాస్‌బుక్ జారీ చేయబడుతుంది..

ఈ ఖాతా ద్వారా 32 లక్షలు ఎలా పొందాలంటే?

మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాల సమయంలో మీరు PPF ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టారని అనుకుంటే.. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. మీరు పిల్లల PPF ఖాతాలో ప్రతి నెలా రూ. 10,000 జమ చేయడం ప్రారంభించాలి. మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 చేసిన డిపాజిట్‌ మొత్తానికి 7.10 శాతం వడ్డీ వస్తుంది. PPF ఖాతా మెచ్యూరిటీపై పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. పిల్లల వయస్సు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని అందుకోవచ్చు. ఈ డబ్బులు మీ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఖర్చులకు ఉపయోగించవచ్చు..ఇది చాలా మంచి పని..కాస్త ముందు ఆలోచనలు ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news