యూత్‌కు బెస్ట్‌ ఇన్సురెన్స్‌ పాలసీలు ఇవే.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్‌

-

రెక్కలు ఉన్నప్పుడే అన్ని ప్రాంతాలను చుట్టిరావాలి. ముసిలి వాళ్లు అయ్యాక ఊరుదాటటం కూడా కష్టమే అవుతుంది. అలాగే సంపాదించే వయసులోనే సేవ్‌ చేయాలి. మీరు ఇప్పుడు ఎంత వెనకేస్తే ఆ వృద్ధాప్యం వచ్చాక అంత జాలీగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఒకరికి భారం కాకుండా జీవించవచ్చు. ఇప్పుడు వచ్చే శాలరీ అంతా మీ ఖర్చులకు, ఇంట్లో కాస్త ఇస్తున్నాం చాలులే అనుకుంటే సరిపోదు. ఇవేవి రేపొద్దున లెక్కలోకి రావు. మీరు ఎంత సంపాదించించారో మీరు చేసిన పొదుపు పెట్టిన పెట్టుబడే చెప్తుంది. యుక్త వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో యూత్‌కి అందుబాటులో ఉన్న వివిధ పాలసీలు ఏంటో చూద్దాం.

సైబర్ ఇన్సూరెన్స్..

ఈ రోజుల్లో సైబర్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. 2021లో 53 వేల సైబర్ నేరాల కేసులు వెలుగు చూశాయి. ఏటా ఇది 5 శాతం క్రమంగా పెరుగుతోంది. దీంతో టెక్ రంగంలో పనిచేసే యువతీయువకులకు ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మారింది. టెకీలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా గడుపుతున్నందున ఫిషింగ్, ఇమెయిల్ స్పూఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, అనధికారిక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, లీగల్ ఖర్చులు, సైబర్ దోపిడీ తదితర నేరాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వీటి బారిన పడితే సర్వస్వం కోల్పోవాలి. సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ రిస్క్ నుంచి కాపాడి ఆర్థిక సహకారం అందజేస్తుంది. సైబర్ ఇన్సూరెన్స్‌లో ఇన్వెస్ట్ చేసి యువత తమ డిజిటల్ అసెట్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి రక్షణ కల్పించుకోవచ్చు.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ప్రీమియం..

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ తీసుకునేందుకు చాలా మంది వెనుకాడుతుంటారు. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీ బెనిఫిట్ పొందే వీలుండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్యను పరిష్కరిస్తూ రిటర్న్ ప్రీమియంతో కూడిన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులోకి వచ్చింది. పాలసీ టర్మ్ పూర్తయ్యాక మొత్తం ప్రీమియం అమౌంట్‌ని వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ, అనుకోని హఠాత్పరిణామం ఎదురైతే పాలసీదారు కుటుంబ సభ్యులకు పాలసీ బెనిఫిట్స్ వర్తిస్తాయి. యువతకు కూడా ఈ పాలసీ మంచి ఎంపిక. కూడబెట్టిన డబ్బులు వృథా కాకుండా ఈ పాలసీతో ఫ్యామిలీకి ఆర్థిక పరమైన రక్షణ ఇవ్వొచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్

ట్రావెల్ చేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, కొన్ని సార్లు పర్యటనల్లో సమస్యలు తలెత్తొచ్చు. ఇలాంటి సమయాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగ పడుతుంది. జర్నీలో ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటం, సామాన్లు చోరీకి గురవడం, ట్రిప్ క్యాన్సల్ కావడం, పాస్‌పోర్ట్ కోల్పోవడం వంటివి జరిగినప్పుడు బీమా కంపెనీ ఆర్థికంగా సహకరిస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీని కల్పించి మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ విత్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్..

ఈ జీవనశైలి వల్ల ఊహించని వ్యాధులు వస్తున్నాయి. ఉద్యోగం అయినా ఎప్పుడు పోతుందా కాస్త అంచానా వేయొచ్చు. కానీ ఈ రోగాల వల్ల, ఈ లైఫ్‌స్టైల్‌ వల్ల ఎప్పడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దుక్కలా చూడ్డానికి బానే ఉంటారు. .కానీ అప్పుడే ఏదో గుండెలో నొప్పి మంట అంటారు సీన్‌ కట్‌ చేస్తే రెస్ట్‌ ఇన్‌ పీస్‌. లేదా లక్షల్లో ఆసుపత్రి బిల్లులు.. చనిపోతే ఒకటేసారి ఖర్చు.. కానీ వైద్యఖర్చులు మన ఒంట్లో ఉన్న ఆఖరి రక్తంబొట్టును సైతం పీల్చుతాయి. వీటి నుంచి ఉపశమనం కల్పించేదే హెల్త్ ఇన్సూరెన్స్. రోడ్డు ప్రమాదంలో గాయపడినా చికిత్సకు ఈ పాలసీ వర్తిస్తుంది. దవాఖానలో అయ్యే ఖర్చులను ఈ పాలసీ భరిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్..

యాడ్ ఆన్స్(Add-Ons)తో కూడిన కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్‌. రోడ్డు ప్రమాదం జరిగినా, చోరీకి గురైనా, డ్యామేజీ జరిగినా మరమ్మతు చేయించడానికి భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఖర్చు నుంచి తప్పించేదే కార్ ఇన్సూరెన్స్. కార్ ఇన్సూరెన్స్‌తో పాటు కొన్ని యాడ్ ఆన్ కవర్స్ కలిగిన బీమాను తీసుకుంటే.. కారు చోరీకి గురైతే అందులో ఉండే వ్యక్తిగత వస్తువులకు కూడా కంపెనీ బీమా చెల్లిస్తుంది. దీంతో పాటు జీరో డిప్రిసియేషన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్, ఎన్‌సీబీ ప్రొటెక్షన్, కీ రిప్లేస్‌మెంట్ వంటి వాటికి ఇన్సూరెన్స్ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version