Ayushman Bharat Yojana: కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ ని తీసుకు వస్తోంది. కేంద్రం అందించే స్కీములు వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని పథకాలను కూడా ఇప్పటికే మన దేశంలోకి తీసుకువచ్చింది. అందులో ఒక మంచి స్కీము ఆయుష్మాన్ భారత్ యోజన. ఈ స్కీమ్ తో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఐదు లక్షల రూపాయలు వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ని పొందవచ్చు దీనికి అర్హులైన వారు ఆసుపత్రికి వెళ్లి ఈ స్కీం కింద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ వివరాలు:
భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్ ని తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ స్కీమ్ ఇది. ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవుతుంది.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి కావలసిన డాక్యుమెంట్లు:
ఆయుష్మాన్ భారత్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. దానితో పాటు రెసిడెన్సి సర్టిఫికెట్, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులందరి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చెయ్యాలి..?
ఆయుష్మాన్ భారత్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా సులువైన ప్రాసెస్. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లో మీరు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. ఈ స్కీం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కవరేజీ కింద రోగిని మూడు రోజుల ముందు ఆసుపత్రిలో చేర్చడంతో పాటుగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజుల పాటు చికిత్సకి అయ్యే ఖర్చులు కేంద్రం బరిస్తుంది.
1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వంటివి కూడా పొందవచ్చు. పేదలతో పాటుగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ పథకంలో చేరడానికి అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారు కేవలం వేతనం మాత్రమే తీసుకునేవారు ఇతర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు