ఆ ఆలయంలోని మట్టికి ఎంత శక్తి ఉందో.. జీవితంలో ఆ నొప్పులు ఉండవు..

-

మన దేశం దేవాలయాలకు పెట్టింది పుట్టినిల్లు..ఎన్నో ప్రత్యెకలు, మహిమలు వున్న ఆలయాలు ఉన్నాయి.. కొన్ని ఆలయాలలో అద్బుతాలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి..అందులో భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటి.ఈ ఆలయాన్ని భూయన్య రాణి మందిరం అని పిలుస్తారు..ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ దేవాలయంలోని మట్టికి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ మట్టి చాలా శక్తివంతమైనదని చెబుతారు. దీన్ని శరీరానికి పూయడం వల్ల వాత సంబంధిత వ్యాధులు, కీళ్లనొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆషాఢమాసం ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో కొలువై ఉంది..హమీర్‌పూర్ జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోఖర్ గ్రామంలోని భువనేశ్వరి దేవి (భుయాన్ రాణి) ఆలయానికి ఆషాడ మాసంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఆలయం వేపచెట్టు కింద వేదికను నిర్మించి.. వేదికపై కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే భక్తుల విశ్వాసం ఇక్కడి మట్టికి సంబంధించినది. ఇక్కడి మట్టిని శరీరమంతా పూయడం వల్ల ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులు, కీళ్లనొప్పులు కూడా నయమవుతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. శారీరక వ్యాధులతో బాధపడే ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు..

వేలాది మంది ప్రజలు ఎముకల, కీళ్ల వ్యాధులనుంచి కోలుకున్నారని స్థానిక నివాసి అభిషేక్ త్రిపాఠి చెప్పాడు. చాలా సార్లు నయం చేయలేని వ్యాధులతో రోగులు ఇక్కడికి వస్తారని.. కొంతమంది రోగులను బంధువులు తమ భుజాలపై ఎక్కించుకుని దేవాలయానికి తీసుకొస్తారు. కోలుకున్న తర్వాత వారు తమ కాళ్ళపై తిరిగి నడుచుకుంటూ వెళ్లారు..

ఈ మహిమాన్విత ఆలయ చరిత్ర..

వందల ఏళ్ల క్రితం ఈ ప్రదేశం చెరువులు, పొదలతో నిండి ఉండేది. ఒక బ్రాహ్మణుడు భయంకరమైన వాతంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక ఆవు రాత్రి అడవిలో ఇక్కడకు వచ్చి, తన పాలన్నీ ఒకే చోట వేసి వెళ్లిపోవడం అతను చూశాడు. ఇది చూసిన బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. అంతేకాదు అతడు నిద్రపోతున్నప్పుడు, ఆత్మహత్య చేసుకోవద్దని కల వచ్చింది. ఆవు పాలు వదిలిన సూరజ్‌కుండ్ అనే ఈ చెరువులో స్నానం చేసి,అక్కడ ఉన్న మట్టిని శరీరానికి రాసుకోవడం వల్ల. వ్యాధిని నయం చేస్తుందని కలలో కనిపించింది. తెల్లవారుజామున నిద్రలేచిన బ్రాహ్మణుడు కలలో వచ్చిన విధానాన్ని పాటిస్తూ చెప్పినట్లే చేశాడు. దీంతో అతని వ్యాధి నయమైంది. అప్పటి నుంచి ఆ మట్టికి ప్రత్యేకత సంతరించుకుంది..

భువనేశ్వరి దేవి ఆలయంలో ఆషాఢ మాసంలోని ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢమాసం ఆదివారం నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. రాణి దర్శనం కోసం ఈ రోజు వేలాది మంది భక్తులు వస్తారు. స్థానిక నివాసి సతేంద్ర అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. వాత రోగులు శనివారాల్లో ఇక్కడికి వచ్చి తమతో పాటు ఆహార పదార్థాలు తీసుకువస్తుంటారు. ఆదివారాలు భౌరీలు చేసి తింటారు. ఇక్కడ ఉన్న చెరువులో స్నానం చేస్తారు. అప్పుడు వారు తల్లికి తమ వ్యాధిని నయం చేయమని విన్నవించుకుంటారు…అలా ఆ మట్టిని ముద్దగా చేసి శరీరానికి చూసుకుంటారు..ఎప్పుడూ ఈ ఆలయంపై నిర్మాణం కట్టినా కూలిపోతుంది..ఈ మాసంలో ఎక్కడేక్కడి నుంచో భక్తులు వస్తారు..వారి రొగాలను నయం చేసుకొని వెలతారు..

Read more RELATED
Recommended to you

Latest news