బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్

-

న్యూఢిల్లీ: బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత నెల్లో కాస్త పర్వాలేదనిపించినా ఈ నెల్లో మాత్రం పసిడి ధరలు పైపైకి ఎగబాకాయి. ఇది బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దేశీయంగా ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములు రూ.1330 పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో ధరలు నిలకడగా ఉండగా, ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాల్లో మాత్రం పెరిగాయి. ఇలా ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలే కారణమని చెపుతున్నారు. జూన్ నెల మొత్తం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల మార్క్ దాటేసిన విషయం తెలిసిందే.

gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50 వేల 300 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల 300 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47 వేలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51 వేల 250 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 470, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.50 వేల 700 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48 వేల 230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49 వేల 230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: రూ. 47 వేలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర: రూ.51 వేల 250గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50 వేల 300 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46 వేల 100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50 వేల 300 ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news