IRCTC టూర్ ప్యాకేజీ.. ఈ చలికాలంలో అరకు అందాలను చుట్టేయచ్చు…!

-

అక్టోబర్ నుంచి జనవరి వరకు అరకు పర్యాటకులతో సందడిగా ఉంటుంది. చాలా మందికి అరకు అంటే ఎంతో ఇష్టం. అయితే కొందరు అరకు వెళ్లాలనుకున్నా సరే ఒక్కోసారి కుదరదు. అయితే IRCTC తాజాగా ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. దీనితో చక్కగా అరకు అందాలని చుట్టేసి వచ్చేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘వైజాగ్ రీట్రీట్’ పేరుతో దీనిని తీసుకొచ్చింది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది. అరకు, సింహాచలం, విశాఖపట్నం చూసేయచ్చు.

మొదటి రోజు ఉదయం పర్యాటకుల్ని రిసీవ్ చేసుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, రుషికొండ బీచ్ చూసి మధ్యాహ్నం భోజనం తర్వాత కైలాసగిరి, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ చూసి నైట్ కి వైజాగ్ లోనే స్టే చెయ్యాలి. రెండో రోజు ఉదయం అరకుకు బయల్దేరాలి.

దారిలో జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం సందర్శించొచ్చు. అదే విధంగా అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శించొచ్చు. సాయంత్రం వైజాగ్ చేరుకున్నాక.. నెక్స్ట్ డే సింహాచలం చూడచ్చు అంతే.

ధరల విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6,960, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.18,140 చెల్లించాలి. ఒకవేళ నలుగురి నుంచి ఆరుగురి వరకు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,910, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.12,745 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version