IRCTC : లద్దాఖ్ టూర్..వివరాలివే..!

-

ఐఆర్​సీటీసీ ఎన్నో ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఆర్​సీటీసీ అందించే ప్యాకేజీలతో లద్దాఖ్​, లేహ్​ వంటి ప్రాంతాలను కూడా చూసొచ్చేయచ్చు. అయితే మరి లద్దాఖ్​, లేహ్​ ని ఎలా చూసొచ్చేయచ్చు…?, టూర్ వివరాలు వంటివి చూద్దాం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

హైదరాబాద్​ నుండి లద్దాఖ్​, లేహ్:

ఐఆర్​సీటీసీ అందించే ప్యాకేజీలతో లద్దాఖ్​, లేహ్​ వంటి ప్రాంతాలను హైదరాబాద్ నుండి వెళ్లి చూసేయచ్చు. ప్యాకేజీ వివరాలను చూస్తే.. ఇది ఆరు రాత్రుల ప్యాకేజీ. ఈ ప్యాకేజీ లో భాగంగా శామ్​ వాలీ, లేహ్​, నుబ్రా, టుర్టుక్​, పాంగ్యాంగ్ ని చూడచ్చు. సెప్టెంబర్​ 8, 23న మరో రెండో ట్రిప్స్ వున్నాయి కనుక వీటిని చూడచ్చు. దీని ధర వచ్చేసి రూ. 41,360 గా వుంది.

ఢిల్లీ నుండి లద్దాఖ్​:

ఇది ఢిల్లీ లో మొదలు కానుంది. సెప్టెంబర్​ 3, 5, 10, 12, 17, 19, 29 తేదీల్లో ట్రిప్స్ వున్నాయి. ప్యాకేజీ ధర రూ. 32,960.

కోల్​కతా నుండి లేహ్ లద్దాఖ్​:

సెప్టెంబర్​ 11, 17, 23 తేదీల్లో ట్రిప్స్ వున్నాయి. ఇది కలకత్తా లో మొదలు కానుంది. ప్యాకేజీ ధర రూ. 41,500. లేహ్​, నుబ్రా, టుర్టుక్​, పాంగ్యాంగ్​ మొదలైనవి సందర్శించవచ్చు.

లక్నో నుండి లద్దాఖ్​:

సెప్టెంబర్​ 7, 14, 21, 28న ట్రిప్స్ వున్నాయి. ప్యాకేజీ ధర రూ. 43,900.ఏడు రాత్రుల ట్రిప్ ఇది.
పూర్తి వివరాలను www.irctctourism.com లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news