రావడం కుదరడం లేదు.. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏం అవుతుందిలే అనుకుంటున్నారా..?

-

ఓటేయడానికి సొంతూళ్లకు బయలుదేరుతున్నారా..? లేదా..? మేనేజర్‌ లీవ్‌ ఇవ్వలేదని, అర్జంట్‌ వర్క్‌ ఉందని, నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం అవుతుందిలే… ఈసారి పక్కా మేం సపోర్ట్‌ చేసే పార్టీయే వస్తుంది.. నేను ఒక్కడిని వెళ్లకపోయినా గెలుపు ఎవరూ ఆపలేరు..ఇలా అనుకోని ఉండిపోతున్నారా..? మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురవుతాం. చరిత్రను ఒక్కసారి చూసుకుంటే.. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు జరిగాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎందరికో అధికారాలు దూరమయ్యాయి, ఎన్నో నిర్ణయాలు తారుమారయ్యాయి, చేతికి అంది. వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. ఒక్క ఓటు తేడాతో జరిగిన ఘటనలు ఇవే..!

ఇదిగో కొన్ని ఉదాహరణలు

  • 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయాడు.
  • ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ బాషగా గుర్తింపు పొందింది.
  • 2008లో రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సీపీజోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది.
  • 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్కు బదులుగా ఇంగ్లీషు అది కార బాష అయింది.
  • 1714లో ఓక్క ఓటు తేడాతో చింగ్ జార్జ్వన్ ఇంగ్లాండులో పీటమెక్కాడు. • 1800లో థామస్ జాప్సర్సన్, 1824లో జాన్స్వీన్ ఆడమ్స్, 1876లో రూథర్ఫర్డ్

జేమ్స్ు ఎలక్టర్ కాలేజ్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు అలంకరించారు.

  • 1923 నవంబరు 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో ఆడాల్టాట్లర్ ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో.

మీకున్న ఒక్క ఓటుకు అంతటిశక్తి ఉందేమో. నీ ఒక్క ఓటే సంచలనం సృష్టించవచ్చు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. బస్సు మిస్‌ అయితే వేరే బస్సు ఎక్కి రావొచ్చు. కానీ నువ్వు నీ ఓటు వేయడం మిస్‌ అయితే మళ్లీ ఐదేళ్ల దాకా ఆ అవకాశం రాదు.. గుర్తుపెట్టుకో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version