దారుణం : 15 రోజులుగా ఇద్దరు చిన్నారులపై అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తూ..!

-

దేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి.. చావుకు సిద్దంగా ఉన్న ముసలవ్వ వరకు ఎవరిని వదలట్లేదు ఈ కామాంధులు. తాజాగా 8 ఏళ్ళ ఇద్దరు చిన్నారుల‌పై.. తాత వయసున్న ఓ నీచుడు అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటలో 8 ఏళ్ళ ఇద్దరు చిన్నారుల‌పై అదే గ్రామానికి చెందిన 55 సంవత్సరాల‌ వృద్ధుడు నారాయణ అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా చిన్నారుల‌కు చాక్లెట్లు ఇస్తూ వెంట తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగడుతూ ఇంట్లో చెప్పద్దని చిన్నారుల‌ను భయపెడుతూ వచ్చాడు. చిన్నారుల‌కు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు అరా తీయగా విషయం మెగులోకి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం నారాయణను బంధించి దేహశుద్ది చేసి పోలీసుల‌కు అప్పగించారు. నిందితుడు నారాయణను అదుపులోకి తీసుకున్న ఎడపల్లి పోలీసులు, ఇద్దరు చిన్నారుల‌ను చికిత్స నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బోధన్‌ సిఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news