కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, మీడియా సంస్థపై కేసు.!

-

గత రెండు రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో, నాయకుల్లో భయం ఏర్పడింది. అసలు ఇది నిజమా కాదా అనే గందరగోళం కూడా ఏర్పడింది. అయితే ఇది ముమ్మాటికి తప్పుడు వార్త అని టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ కార్యకర్త ఇలియాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే స్పందించిన పోలీసులు ఈ తప్పుడు వార్తను ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ మీడియా సంస్థపై కేసు నమోదు చేసి.

హైదరాబాద్ పత్రిక ఎడిటర్ వెంకటేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని, ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా అంటూ వార్తలు ప్రచురించారు. అయితే ఇది అవాస్తమని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ తో ప్రజలను భయపెట్టొద్దని పోలీసు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news