ఛీ..ఛీ.. ఇదేం పాడుపని. అది క్లాస్ రూం అని కూడా మరిచిపోయి టీచర్లు చేసిన నిర్వాకం చూసి అక్కడి ప్రాంత వాస్తులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. ఇలా క్లాస్‌రూంలోనే ముద్దులు పెట్టుకోవడమేందని మండిపడుతున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్నది. ఓ ఉపాధ్యాయుడు.. తన సహోపాధ్యాయురాలిని గట్టిగా పట్టుకొని ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి వీళ్ల రాసలీలలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో విద్యాశాఖ అధికారులకు అందడంతో ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)