సెల్ఫ్ గోల్: బీజేపీ అంటే సరే… బాబుకేమైంది?

-

చంద్రబాబు మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొస్తుంటారు.. ఆ అనుభవం అనే పదం అడ్డుపెట్టుకునే 2014లో అధికారంలోకి వచ్చారని కూడా చెబుతుంటారు జనసేన కార్యకర్తలు! సరే బాబు & కో చెబుతున్నంత స్థాయిలో కాకపోయినా… అనుభవం అయితే బాబుకు పుష్కలంగా ఉంది! ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నేర్పు ఓర్పు ఉందని కూడా చెబుతారు. మరి అలాంటి బాబు జగన్ ని ఎదుర్కునో విషయంలో ఎందుకు ఇలాంటి తప్పటడుగులు వేస్తూ.. సొంతంగా ఆలోచించలేకపోతున్నారు!

అవును.. ప్రస్తుతం బాబు వైఖరి చూస్తున్నవారంతా ఒకటే ఆలోచిస్తున్నారు. బాబు సొంతంగా ఆలోచించడం ఎందుకు మానేశారనేది ఆయన అభిమానుల ప్రశ్న. రాజకీయ చాణక్యుడిని అని చెప్పుకునే బాబు ఇలా ఎందుకు మారిపోయారు! ఈ ప్రశ్నలు ఉత్పన్నమవడానికి గల కారణాలు… బీజేపీ ఎత్తుకున్న పంథానే బాబు ఎత్తుకోవడం! అవును… దేవాలయాలు, విగ్రహాల ద్వంశాల విషయంలో బీజేపీ పోరాటాలు గట్రా చేస్తుంది! వారి కంటే తప్పదు.. ఏపీలో వారి స్థాయికి ప్రస్తుతం ఆ సమస్యలే దిక్కు.. వాటిపైనే జెండాలు పాతేద్దాం అని అనుకుంటున్నారు!!

అందులో అర్ధం ఉంటే ఉండి ఉండోచ్చు. మరి బాబుకు ఏమైంది. బాబు కూడా బీజేపీ నేతల్ల కేవలం ఆ విషయాలపైనే జగన్ ను ఏదో ఇరుకునపెట్టేస్తున్నాం అని సంబరపడిపోతున్నారు. ఒక మ‌తం ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కానీ…ఈ క్రమంలో… తాను క్రిస్టియ‌న్‌, ముస్లింలు, ద‌ళితుల‌కు మ‌రింత దూరం అవుతున్నాన‌నే వాస్త‌వాన్ని చంద్ర‌బాబు గ్రహించలేకున్నారనేది తమ్ముళ్ల ఆవేదనగా ఉంది!

మరి ఇంత సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు… ఈ విషయంలో కాస్త పునరాలోచించుకుంటారా లేక ఏదోలా బీజేపీకి దగ్గరయ్యేలా ప్రవర్తిస్తే చాలు అని సరిపెట్టుకుంటారా అనేది పెద్ద ప్రశ్నే! పోనీ జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ కాలం గడిపేద్దామనుకుందామంటే… ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు.. బాబు పేరెత్తితేనే అంతెత్తున లేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కూడా బాబు కేవలం ఇలానే ఎందుకు ఆలోచిస్తున్నారో!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news