“అంగడి బొమ్మలు” పునాదులు కూడా కూల్చెయ్యి జగనన్నా!

-

వైఎస్ జగన్ కు కొత్త రిక్వస్ట్ పెడుతున్నారు ఏపీలోని ఆడపడుచులు! గత ప్రభుత్వంలో జరిగిన దారుణాల, దుర్మార్గాల ఫలితంగా ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సూచిస్తున్నారు! చంద్రబాబు హయాంలో నాటుకుని, మహావృక్షంగా మారిన ఎన్నో అవినీతి, అక్రమ, స్వార్ధపూరిత, ప్రజావ్యతిరేక పునాదులను కూల్చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీలోని ఆడపడుచులు ఒక రిక్వస్ట్ పెట్టుకుంటున్నారు! అందుకు కారణమైంది తాజాగా విడుదలయిన ఎన్‌.సీ.ఆర్.‌బీ-2019 నివేదిక!

అవును… మహిళలను అంగడి బొమ్మలుగా విక్రయించే ముఠాలు ఏపీలోనే ఎక్కువని ఎన్‌.సీ.ఆర్.‌బీ నివేదిక తెలిపింది. ఇలాంటి ముఠాలు మహారాష్ట్ర తర్వాత ఏపీలో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే… వీటన్నింటికీ బలమైన పునాది చంద్రబాబు హయాంలో బలంగా నెలకొంది.. ఫలితంగా రాష్ట్రంలో మూడేళ్లుగా పెరుగుతోన్న మానవ అక్రమ వల్ల నేడు ఈ పరిస్థితి తీవ్రరూపం దాలుస్తుందని నివేదిక పేర్కొంది!

దీంతో నాడు బాబు హయాంలో అత్యంత బలంగా వేసుకున్న ఈ పునాదుల వల్ల నేడు ఆ ప్రభావం తాజా ప్రభుత్వంపై కూడా పడుతుందని చెబుతున్నారు విశ్లేషకులు! కాబట్టి… అభివృద్ధి, సంక్షేమాలతో పాటు ఇలాంటి విషయాలపై కూడా జగన్ బలమైన శ్రద్ధ పెట్టాలని.. ఈ అక్రమాలను కూడా పునాదులతోసహా పెకలించివేయాలని కోరుకుంటున్నారు ఆడపడుచులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news