బీహర్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బీజేపీ అగ్రనేతలను కరోనా కలవరం పెడుతుంది..బీహర్ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది..14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆయనకు సూచించారని..ఈ మేరకు ట్విటర్లో ప్రకటించారు దేవేంద్ర ఫడ్నావిస్..
గత నాలుగు రోజులగా తనను కలిసిన కార్యకర్తలు, సన్నిహితులు, నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుండి నేను ప్రతిరోజూ పని చేస్తున్నాను, కాని ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నట్లు అనిపిస్తుందన్నారు ఫడ్నావిస్..వైద్యుల సలహా మేరకు అన్ని మందులు, చికిత్సలు తీసుకుంటున్నాన్నారు..
బీహర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి ఎన్నికల ముందు ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న ఫడ్నావిస్కు కరోనా రావడం పెద్ద దెబ్బె అని చెప్పవచ్చు..బీహర్ ఎన్నికలను దగ్గరి నుంచి పరిశీలిస్తున్న ఫడ్నావిస్కు కరోనా రావడంతో దాని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండే అవకాశాలు ఉన్నాయి..