ప్రభాస్ ఆల్టర్నేట్ విజయ్ దేవరకొండ

-

అదేంటి అప్పుడే విజయ్ దేవరకొండకు ప్రభాస్ ను రీప్లేస్ చేసే రేంజ్ వచ్చిందా.. అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ అయ్యాడు మరి అతని ఆల్టర్నేట్ గా విజయ్ దేవరకొండ ఎలా అయ్యాడు అంటే. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో తన క్రేజ్ ఏర్పరచుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ కూడా లైన్ లో ఉంచాడు ప్రభాస్. ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

ఈ రెండు సినిమాల బిజీలో ఉండటం వల్ల బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ కు ఇచ్చిన సినిమా ఛాన్స్ కాదనేశాడు. 2020 వరకు హింది సినిమా ఛాన్స్ లేదని చెప్పాడట. ఆ తర్వాత కూడా చేస్తాడన్న గ్యారెంటీ లేదు. ఇదిలాఉంటే ప్రభాస్ తో అనుకున్న సినిమాను కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో ఫిక్స్ చేశాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా జాన్వి నటిస్తుందని తెలుస్తుంది.

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ లో విజయ్ తో సినిమా చేసేందుకు రెడీ అన్న జాన్వి కామెంట్స్ చూస్తే కరణ్ సినిమాలో విజయ్, జాన్వి జోడీ ఫిక్స్ అవ్వొచ్చు. సో ప్రభాస్ తో ప్లాన్ చేసిన సినిమా కాస్త అతని ఆల్టర్నేట్ గా విజయ్ వచ్చి చేరాడు. మరి బాలీవుడ్ లో విజయ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news