నిమ్మగడ్డ అడిగిన అన్ని స్థాన చలనాల మీద ఏపీ ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. గుంటూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్,నారాయణ్ భరత్ గుప్తాలను జీఎడికి ప్రభుత్వం సరండర్ చేసింది. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దినేష్ కుమార్,మార్కండేయులకు కలెక్టర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అంతే కాక తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఆయా అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని గతంలో సీఎస్ కు ఈసీ సూచించారు. ఇక అనంతపురం జిల్లలో కూడా ఎన్నికల కమీషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఇద్దరు అధికారులు డీజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు,సీఐ తేజోమూర్తిని డీజీకి అటాచ్ మెంట్ చేశారు. గతంలో శ్రీ కాళహస్తి డీఎస్పీగా ఉన్న నాగేంద్రుడును విధుల నుంచి తప్పించి , సరెండర్ చేయాలని ఎస్ ఈసీ కోరింది.