ఖమ్మంలో అధికార,విపక్షాల‌ విచిత్ర పొత్తులు..సంజయ్ ప్రచారంతో స్పీడు పెంచిన బీజేపీ

-

ఖమ్మంలోనూ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి అధికార,విపక్ష పార్టీల మధ్య విచిత్ర పొత్తులు ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారాయి. గతంలో జిల్లాలో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఈసారి పార్టీ అధ్యక్షుడు సంజయ్ ప్రచారంతో స్పీడు పెంచింది. కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తో సహా అన్ని ప్రధాన పార్టీలు కూడా పొత్తులతోనే బరిలో దిగాయి.

పువ్వాడ కుటుంబం ఎటు ఉంటే అటు మొగ్గే సీపీఐ ఈసారి టిఆర్ఎస్ తో పోత్తు పెట్టుకుంది. 56 డివిజన్లలో టిఆర్ఎస్ పోటిచేస్తుండగా. 3 డివిజన్లు సీపీఐకి కేటాయించింది. ఇప్పటికే 10 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకు తావులేకుండా సిపిఎం, టిడిపిలతో పరస్పరం అవగాహన కదుర్చుకుంది. 10 డివిజన్లలో సీపీఎం పోటి చేస్తుండగా… పోటిలో లేని స్థానల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది సిపిఎం. కాంగ్రెస్‌ మొత్తం 46 డివిజన్లలో పోటి చేస్తుంది. బీజేపీ, జనసేన కూటమి 60 డివిజన్లలో 51 డివిజన్లలో మాత్రమే పోటిచేస్తుంది. 47 డివిజన్లలో బీజేపీ.. నాలుగు డివిజన్లలో జనసేన అభ్యర్ధులు పోటీచేస్తున్నారు. కేవలం రెండు డివిజన్లలోనే స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

ఖమ్మం లో అధికార టీఆర్‌ఎస్‌ ప్రచార హోరు పెంచింది. ఇప్పటికే పార్టీ మద్దతు దారులతో ప్రచారంలో దూసుకుపోతున్నారు అభ్యర్ధులు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మలలు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాను మూడు బాగాలుగా విభజించి కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్ రాకతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార రథాలను ప్రారంభించింది.. ఇప్పటికే బీజేపీ అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే..జాతీయపార్టీ బీజేపీ తోనే సాధ్యయమవుతుందని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఖమ్మం కార్పోరేషన్ లో గతంలో ఒక్క సీటు సాధించని బీజేపీ ఈసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news