న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత వారంగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజుకు పది పైసలు నుంచి 20 పైసలు చొప్పున పెరుగుతున్నాయి. శనివారం కూడా 20 పైసలు పెరిగింది. దీంతో కొన్నిచోట్ల లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటేసింది. మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీకి చేరువలో ఉన్నాయి. ముంబై, జైపూర్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటేశాయి. హైదరాబాద్లో రూ. 100కు దగ్గర్లో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.98.48 పైసలుగా ఉంది. అటు డీసిల్ ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో పెరిగాయి. హైదరాబాద్లో శుక్రవారం డీసిల్ ధర రూ. 93.38గా ఉంది.
పలు ప్రాంతాల్లో పెట్రల్, డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి…
న్యూఢిల్లీ: పెట్రోల్ రూ. 94.76, డీజిల్ రూ. 85.66
ముంబయి: పెట్రోల్ రూ. 100.98, డీజిల్ రూ. 92.99
జైపూర్: పెట్రోల్ రూ. 100.94, డీజిల్ రూ. 94.16.
చెన్నై: పెట్రోల్ రూ. 96.23, డీజిల్ రూ. 90.38
బెంగళూరు: పెట్రోల్ రూ. 97.92, డీజిల్ రూ. 90.81
కోల్కత: పెట్రోల్ రూ. 95.49. డీజిల్ రూ.93.34
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్ రూ. 98.48, డీజిల్ రూ. 93.38
కరీంనగర్:పెట్రోల్ రూ. 98.63, డీజిల్ రూ. 93.50
విజయవాడ:పెట్రోల్ రూ. 100.89, డీజిల్ రూ. 95.19
విశాఖ: పెట్రోల్ రూ. 99.90, డీజిల్ రూ. 94.36