రేవంత్ రెడ్డికి ఈటల ప్లస్ అవుతున్నారా?

-

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దూకుడు మొదలుపెట్టాయి. అలాగే గతంలో కంటే ఇప్పుడు టీఆర్ఎస్‌కు వ్యతిరేకత బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. అన్నీ వైపులా నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై దాడి పెరుగుతుంది. అయితే టీఆర్ఎస్‌పై వ్యతిరేకిత అంతా కాంగ్రెస్‌కు కలిసొస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానికి కూడా ఓ లాజిక్ చెబుతున్నారు.

revanth reddy etela rajender

ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, షర్మిల పార్టీ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, కోదండరాం, కమ్యూనిస్టులు, తీన్మార్ మల్లన్న లాంటి వారు కేసీఆర్‌ని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వీరు నిత్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా ఇన్ని ప్రతిపక్షాలు ఉండటం వల్ల ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి, మళ్ళీ అధికార పక్షానికే బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

కానీ ప్రతిపక్షంగా ఉండి ఎవరు పోరాడిన అది కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని రేవంత్ చెబుతున్నారు. గతంలో తెలంగాణ కోసం అన్నీ పార్టీలు పోరాటం చేశాయని, అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని, కానీ క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు వచ్చిందని, అందుకే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే కేసీఆర్‌పై ఎవరు పోరాడిన అది కాంగ్రెస్‌కే బెనిఫిట్ అవుతుందని అంటున్నారు.

అలాగే ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిలబడిన ఈటల రాజేందర్ గెలిస్తే, అప్పుడు కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకిత ఏంటో బయటపడుతుందని, అది పరోక్షంగా కాంగ్రెస్‌కే లబ్ది చేకూరుతుందని చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి లాజిక్ రాజకీయాలు ఏ మేర వర్కౌట్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news