దేశంలో కరోనా వ్యాక్సినేషన్ త్వరితగతిన సాగుతోంది. ఇప్పటికే 120 కోట్ల డోసులను దేశ ప్రజలకు అందించారు. కాగా ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ధడ పుట్టిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. వ్యాక్సినేషన్ వేసుకోని వారుంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాాలు ప్రజలను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పాలిత, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ తక్కువగా ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కనీసం మొదటి డోసు కూడా 90 శాతం పూర్తి చేయలేదు. రెండో డోసు కనీసం 50శాతం మందికి కూడా పూర్తికాలేదు.
ఇక వ్యాక్సినేషన్ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాత్రం వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కూడా 90 శాతం మొదటి డోసు వ్యాక్సిన్ ను పూర్తిచేసి రెండో డోసును కూడా 50 శాతం వరకు పూర్తి చేశాయి.
వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వివరాలు