దానికి ఒప్పుకున్నవాడే త‌న‌కు మొగుడు : సారా అలీఖాన్ సంచ‌ల‌నం

-

బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీఖాన్ వ‌రుస సినిమాల‌తో జోష్ మీద ఉంది. అలాగే సారా అలీ ఖాన్ కు క్రేజ్ కూడా విప‌రీతంగా పెరుగుతుంది. కేద‌ర్ నాథ్ సినిమా తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఈ బామ్మ మొద‌టి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకుంది. వీటి తో పాటు లవ్ ఆజ్ క‌ల్, కూలీ నం 1 సినిమా చేసింది. తాజా గా అత్రాంగి రే అనే సినిమాలో సారా అలీ ఖాన్ సంద‌డి చేసింది. అయితే అత్రాంగి రే సినిమా లో ఈ యంగ్ హీరోయిన్ వివాహిత పాత్ర‌లో న‌టించింది. అయితే ఈ పాత్ర కు గాను సారా అలీ ఖాన్ మంచి పేరు వ‌చ్చింది.

అయితే ఈ సినిమా సూప‌ర్ హిట్ కూడా కొట్టింది. కాగ ఈ సినిమా సక్సస్ మీట్ ను ఇటీవ‌ల చిత్ర బృందం నిర్వ‌హించింది. అయితే ఈ స‌క్సస్ మీట్ లో సారా అలీ ఖాన్ త‌న పెళ్లి గురించి ఆస‌క్తి క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు కాబోయే వాడు ఇల్ల‌రికం వ‌స్త‌నే పెళ్లి చేసుకుంటాన‌ని తెల్చి చెప్పింది. సారా అలీఖాన్ కు త‌న త‌ల్లి అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. త‌న‌ను విడిచి వెళ్ల‌డం ఇష్టం లేద‌ని సారా అలీఖాన్ తెల్చి చెప్పింది. కాగ సైఫ్ అలీ ఖాన్ కుతూరు సారా అలీ ఖాన్. అయితే సైఫ్ అలీ ఖాన్ కు మొద‌ట అమృతా సింగ్ అనే భార్య ఉండేది. వీరికి సారా అలీఖాన్ జ‌న్మించింది. కాగా సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ కు విడాకులు ఇచ్చి క‌రీనా క‌పూర్ ను వివాహం చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news