ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్..ఎల్లుండే సమావేశం

-

సినిమా టికెట్ల విషయం… కొరకరాని కొయ్యగా తయారైంది. టికెట్ల ధరలు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని టాలీవుడ్‌ పెద్దలు డిమాండ్‌ చేస్తూంటే.. అబ్బే అస్సలు తగ్గేదేలే అంటూ జగన్‌ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తుంది. అన్నిటికీ ఎంఆర్‌పీ ఉన్నట్లే… సినిమా టికెట్లకు ఫిక్స్‌డ్‌ ధరలు ఉండాలని జగన్‌ సర్కార్‌ వాధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంలోకి టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎంటర్‌ అయ్యాడు.

ఇంకేముంది… వరుస ట్వీట్లతో… ఏపీ సర్కార్‌ ను ఇబ్బందుల్లోకి నెట్టాడు వర్మ. సినిమాటోగ్రాఫి మంత్రి పేర్ని నానిని వరుస ట్విట్లతో ఇబ్బంది పెట్టాడు వర్మ. దీంతో దెబ్బకు దిగివచ్చిన మంత్రి పేర్ని నాని… రామ్‌ గోపాల్‌ వర్మ కు అపాయింట్‌ మెంట్ ఇచ్చాడు. ఈ నెల 10వ తేదీన ఆర్జీవీతో అమరావతి సచివాలయలో మంతి పేర్ని నాని భేటీ కానున్నారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదికగా… పేర్ని నాని పేర్కొన్నారు. అలాగే… అటు వర్మ కూడా దీనిపై స్పందించాడు. తనకు మంత్రి పేర్ని నాని అపాయింట్‌ మెంట్‌ ఇచ్చారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news