ఐసోలేషన్ నుంచే సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ…

-

ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేప‌ల్లి రైల్వేస్థ‌లాల్లో నివాసితులకి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇచ్చిన హామీ మేర‌కు వేరేచోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించేవ‌ర‌కూ, రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా స‌మయం ఇచ్చేలా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు.

ys jagan on nara lokesh

2019 ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మీ నాయకులు ఈ రైల్వేస్థ‌లంలో వున్న పేద‌ల‌కు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు నారా లోకేష్. కూలి కెళితేకానీ కూడు దొర‌క‌ని నిరుపేద‌లైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు చెందిన 650 కుటుంబాల స‌మ‌స్య‌ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యే ప్ర‌భుత్వం తరపున ఇచ్చిన హామీ మేర‌కు 650 మందికి వేరే చోట ఇళ్లు క‌ట్టి త‌ర‌లించేవ‌ర‌కూ ఇక్క‌డే నివాసం వుండేలా రైల్వే అధికారుల‌ని ఒప్పించాల్సిన బాధ్య‌త ప్రభుత్వం పై ఉందని స్పష్టం చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news